NLG: ఆధునిక ఫాస్ట్ ఫుడ్ సంస్కృతిని వీడి, ప్రజలు మళ్లీ తెలంగాణ ప్రాచీన వంటకాలపై మక్కువ చూపుతున్నారు. ఆరోగ్యంపై అవగాహన పెరగడంతో జొన్న రొట్టెలు, పచ్చిపులుసు వంటి సంప్రదాయ రుచులకు ఆదరణ పెరుగుతోంది. హాలియాలో జరిగిన ఓ వివాహ వేడుకలో వడ్డించిన కుంటికూర, సర్వపిండి వంటి వంటకాలు అతిథులను విశేషంగా ఆకట్టుకున్నాయి.