BHNG: రాజపేట మండలం చల్లూరు గ్రామ రెవెన్యూ పరిధిలోని వాగులో అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను తహసీల్దార్ వల్లపు ప్రదీప్ సమాచారం మేరకు ఎస్సై లింగారెడ్డి బృందం ఆ ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నారు. కేసులు నమోదు చేయనున్నారు. ఉగాది పండగ సెలవు రోజు అయినప్పటికీ తాహసీల్దార్ విధులు నిర్వహించడం పట్ల రైతులు మండల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.