RR: స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎలిమినేడు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నట్లు తెలిపారు. గ్రామాలకు మంచి పాలన అందించే అభ్యర్థినే ప్రజలు ఎన్నుకుంటారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
NLG: చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామపంచాయతీ నూతన పాలకవర్గం ఈనెల 20న ప్రమాణ స్వీకారం చేయనుంది. సర్పంచ్‌గా సాగర్ల భాను శ్రీ భిక్షం, ఉప సర్పంచ్ ఉయ్యాల నరేష్, 11 మంది వార్డు సభ్యులుగా పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. నూతన పాలకవర్గం కొలువు ధీరనున్నందున పంచాయతీ కార్యదర్శి గ్రామ పంచాయతీ భవనానికి చిన్నచిన్న మరమ్మతులు చేపట్టి రంగులు వేయించారు.
WNP: ఓటర్లు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకొని ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి కోరారు. బుధవారం పెబ్బేరు, శ్రీరంగాపురం, కంచిరావుపల్లి గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. వృద్ధులు, దివ్యాంగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కేంద్రాల్లో ప్రత్యేక వసతులు కల్పించినట్లు తెలిపారు.
BHPL: జిల్లా మాజీ DCC అధ్యక్షుడు, రాష్ట్ర ట్రేడ్ కార్పొరేషన్ చైర్మన్ ఐతే ప్రకాష్ రెడ్డి మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. వల్లెంకుంట గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ స్టేషన్లో ఆయన ఓటు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఓటు ప్రజలకు ఆయుధం లాంటిదని, ఓటు వేసి సరైన నాయకున్ని ఎన్నుకోవాలని ఓటర్లను కోరారు.
GDWL: గ్రామాల సమగ్ర అభివృద్ధికి పునాది వేసేది మన ఓటు, అందుకే ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకుని బాధ్యతాయుతమైన నాయకత్వాన్ని ఎన్నుకోవాలి, అని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు డాక్టర్ కురువ విజయ్ కుమార్ పిలుపునిచ్చారు. బుధవారం ఇటిక్యాల మండలం బుడ్డారెడ్డిపల్లి గ్రామంలో ఆయన తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
MDK: మెదక్ జిల్లాలో ప్రశాంతంగా పోలింగ్ జరుగుతున్నట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పేర్కొన్నారు. మూడో విడత ఎన్నికలలో కౌడిపల్లి పోలింగ్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సందర్శించారు. ఓటు కలిగిన ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కులు వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ప్రజలకు పిలుపునిచ్చారు. ఎన్నికల సందర్భంగా 144 సెక్షన్ అమల్లో ఉందన్నారు.
NRPT: ఊట్కూరు మండలం మొగ్దుంపూర్ పోలింగ్ కేంద్రం వద్ద ఓ మహిళ తన చంటి పాపతో ఓటు వేయడానికి రాగా విధుల్లో ఉన్న మహిళా కానిస్టేబుల్ ఆ చిన్నారిని ఎత్తుకొని లాలించారు. దీంతో ఆ తల్లి ప్రశాంతంగా ఓటు హక్కు వినియోగించుకుంది. పోలీసుల సేవా దృక్పథాన్ని చూసి గ్రామస్థులు, ఓటర్లు హర్షం వ్యక్తం చేస్తూ ప్రశంసల వర్షం కురిపించారు.
NZB: గ్రామ పంచాయతీ మూడో విడత ఎన్నికల్లో భాగంగా బుధవారం ఆర్మూర్ మండలం గోవింద్‌పేట్‌లో యువత ఓటు హక్కు వినియోగించుకున్నారు. గ్రామాభివృద్ధికి ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. మొదటిసారి గ్రామాభివృద్ధికి ఓటు వేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.
HYD: మాదాపూర్ NIA రోడ్ వైపు నుంచి సైబర్ టవర్స్ జంక్షన్ దారిలో వాహనాల రద్దీతో ట్రాఫిక్ నెమ్మదిగా కదులుతోంది. సైబరాబాద్ పోలీసులు క్రమబద్ధీకరణ చర్యలు చేపట్టారు. ఈ రూట్లో వెళ్లేవారు ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకుంటే త్వరగా గమ్యస్థానానికి చేరుకోవచ్చని ట్రాఫిక్ పోలీసులు సూచించారు.
SRPT: మూడవ విడత సర్పంచ్ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో బుధవారం నేరేడుచర్ల మండలం పెంచికల్ దీన్నే ఆవాస గ్రామం తెలగ రామయ్య గూడెంలోని పోలింగ్ బూత్‌ను స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ అనూష పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ.. ఎన్నికలు ప్రశాంతంగా జరగాలని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని అధికారులకు సూచించారు.
WNP: పాన్ గల్ మండలం కేతేపల్లి గ్రామంలో డీసీసీబీ ఛైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి బుధవారం తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. సర్పంచ్ అభ్యర్థి విష్ణు, ధరణి కన్స్ట్రక్షన్ అధినేత బాలీశ్వర్ రెడ్డితో కలిసి ఆయన పోలింగ్ కేంద్రానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామ ప్రగతి కోసం కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని కోరారు.
RR: మూడో విడత పంచాయతీ ఎన్నికలు సైతం ముగింపు దశకు చేరుకుంది. ఇంకాస్తా సమయం మాత్రమే మిగిలి ఉండడంతో ఓటర్లు పరుగులు తీస్తున్నారు. కాగా, మండలంలోని బేగరికంచలో యువతులు మొదటిసారిగా పంచాయతి ఎన్నికల ఓటింగ్‌లో ఉత్సాహంగా పాల్గొని ఓటేశారు. సర్పంచ్ ఎనికల్లో మొదటిసారిగా ఓటేయడం చాలా సంతోషంగా ఉందని, గెలిచిన సర్పంచ్ అభ్యర్థి గ్రామ అభివృద్ధి చేయాలని కోరారు.
MBNR: కాంగ్రెస్ పార్టీ ద్వారానే అభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస రెడ్డి అన్నారు. గ్రామపంచాయతీ ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసి ఘనవిజయం సాధించిన కాట్రావత్ వెంకటేష్, కోర్ర రాములు బుధవారం ఎమ్మెల్యేను క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామ అభివృద్ధి కోసం చేసే కార్యక్రమాలకు అండగా ఉంటామన్నారు.
SDPT: మద్దూరు మండలం లద్నూర్ గ్రామంలో బుధవారం జరిగిన పంచాయతీ ఎన్నికల్లో 100 ఏళ్ల వృద్ధుడు అబ్దుల్ షమీ తన ఓటు హక్కును వినియోగించుకుని ఆదర్శంగా నిలిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తన స్వగ్రామంలో ఓటు వేయడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని ఆనందం వ్యక్తం చేశారు. శతవృద్ధుడి ఉత్సాహాన్ని చూసి తోటి ఓటర్లు, అధికారులు ఆశ్చర్యపోతూ అభినందనలు తెలిపారు.
జగిత్యాలలో మూడో విడత పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ సత్యప్రసాద్ బుధవారం పరిశీలించారు. ఎండపల్లి మండలంలోని రాజారంపల్లి, గుల్లకోట, ధర్మపురి మండలం రాయపట్నం, జైన, రాజారామ్, వెల్గటూర్ మండల కేంద్రాలలో పోలింగ్ కేంద్రాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా పోలింగ్ సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఆయన వెంట ఆర్డీవో మధుసూదన్ తదితర అధికారులు ఉన్నారు.