ASF: హైదారాబాద్లో ఈ రోజు జరగనున్న ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజవర్గ స్థాయి కాంగ్రెస్ పార్టీ కీలక సమావేశానికి కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్ రావు ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు తరలివెళ్లారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో రాబోయే ఎన్నికల్లో విజయం సాధించడంపై దిశానిర్దేశం చేయనున్నారు.
ADB: జిల్లా పర్యటనకు వచ్చిన రాష్ట్ర మంత్రి సీతక్కను జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ గౌస్ అలాం పట్టణంలోని పెన్ గంగా అతిథి గృహంలో సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఆమెకు పూల మొక్క అందజేసి సాదర స్వాగతం పలికారు. అనంతరం జిల్లాలోని పలు అంశాలను మంత్రితో వారు చర్చించారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు తదితరులున్నారు.
MNCL: చెన్నూర్ నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలో రూ. వంద కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. చెన్నూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఖాళీగా ఉన్న వైద్య సిబ్బందిని భర్తీ చేయాలని ఆరోగ్య శాఖ మంత్రి రాజనర్సింహను కోరినట్లు చెప్పారు.
MNCL: చెన్నూరు వ్యవసాయ మార్కెట్ పరిధిలోని ఐదు జిన్నింగు మిల్లులో తాత్కాలికంగా పత్తి కొనుగోళ్లు నిలిపివేస్తున్నట్లు మార్కెట్ కమిటీ కార్యదర్శి రామాంజనేయులు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. పత్తి నిలువలు పేరుకుపోయాయని పేర్కొన్నారు. తదుపరి కొనుగోలు తేదీని తెలిపేంతవరకు రైతులు పత్తిని మిల్లులకు తీసుకురావద్దని సూచించారు. ఈ విషయాన్ని రైతులు గమనించాలని కోరారు.
NRML: నర్సాపూర్(జి)మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ వద్ద సోమవారం రోడ్డుపై కారు ఢీకొన్న ఘటనలో మార్నింగ్ వాక్ చేస్తున్న ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల వివరాల మేరకు నర్సాపూర్ (జి)కి చెందిన ఇద్దరు వ్యక్తులు గంగారెడ్డి, గణపతి రోడ్డుపై మార్నింగ్ వాక్ చేస్తుండగా వెనక నుంచి కారు ఢీకొనగా ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా వారిని ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.
NRML: ఓ వివాహిత అదనపు కట్నం వేధింపులకు గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘనట నిర్మల్లో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. మంజులాపూర్కు చెందిన అశ్విని(30)భర్త, అత్తింటి వేధింపులు భరించలేక తమ ఇంట్లో పురుగుల మందు తాగింది. స్థానికులు ఆమెను జిల్లా కేంద్రలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆమె తల్లిదండ్రులు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
WGL: గుండ్రాతిమడుగు-డోర్నకల్ రైల్వేస్టేషన్ మధ్య కేఎం నంబర్ 454-18-20 ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. గుర్తు తెలియని రైలు నుంచి జారిపడి ప్రమాదవశాత్తు మరణించినట్లుగా తెలుస్తోంది. MHBD స్టేషన్ మాస్టర్ ఫిర్యాదు మేరకు డోర్నకల్ జీఆర్పీ ఎస్సై సురేశ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, మృతుడి వయస్సు 50 నుంచి 55 ఏళ్లు ఉంటుందని అంటున్నారు.
WGL: సంక్రాంతి వచ్చిందంటే చాలు.. ఆకాశంలో గాలిపటాలు ఎగురుతుంటాయ్. చిన్నా, పెద్దా తేడా లేకుండా ఎగరవేస్తుంటారు. అయితే ఉమ్మడి వరంగల్ జిల్లాలోని కొందరు కైట్స్ ఎగరవేయడానికి చైనా మాంజా వాడుతుండటంతో రోడ్లపై వెళ్లే వారికి అవి ప్రమాదకరంగా మారాయి. గతంలో చైనా మాంజాతో గొంతులు తెగి ప్రాణాలు పోయిన సందర్భాలూ ఉన్నాయి అని అన్నారు.
WGL: నగరంలోని జర్నలిస్ట్ భవనంలో టీయూడబ్ల్యుజే ఐజేయు జిల్లా అధ్యక్షులు రామచందర్ అధ్యక్షత న కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా కార్యవర్గ సభ్యులు పాల్గొని పలు అంశాలపై చర్చించి ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. తీర్మానంలో నూతన సభ్యత్వం కార్యక్రమం యూనియన్ సభ్యులకు యూనియన్ గుర్తింపు కార్డుతోపాటు వాహనాలకు స్టిక్కర్లను ముదిరించడంపై చర్చించారు.
ASF: జిల్లాలో చలి గజగజ వణికిస్తోంది. ఉష్ణోగ్రత పడిపోతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సిర్పూర్ (యూ)లో 6.1, తిర్యాణి 7.1, కెరమెరి 8.3, బెజ్జూరులో 9.0 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పొగమంచుతో రహదారులు కనిపించడం లేదని వాహనదారులు వాపోతున్నారు.
NRML: మామడ మండలంలోని దిమ్మదుర్తి ఫీడర్ పై చెట్ల కొమ్మల తొలగింపు, సబ్ స్టేషన్ల నెలవారీ మరమ్మతుల్లో భాగంగా నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏఈ బాలయ్య తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2గం.ల వరకు 33/11 కెవి పరిధిలోని పొన్కల్, దిమ్మదుర్తి, కమల్ కోట్, అనంతపేట్, నల్దుర్తి, తదితర గ్రామాలకు అంతరాయం ఉంటుందన్నారు. విద్యుత్ వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.
MDK: పాపన్నపేట మండలంలోని శ్రీ ఏడుపాయల దేవాలయంలో వన దుర్గా భవాని మాతకు ఆదివారం వేకువజాము నుండి అర్చకులు పార్థివ శర్మ భాను వాసరే ప్రత్యేక పూజలు చేపట్టారు. భక్తుల ఇలవేల్పు భవాని మాతకు ప్రత్యేక అలంకరణలతో విశేష అభిషేక పూజలు చేశారు. అనంతరం మంగళ హారతి, దీపం, గుగ్గిల ధూపం, నారికేళ, ఫల నైవేద్యం నివేదన చేశారు.
MDK: సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు. సైబర్ నేరాలు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ఎవరైనా బాధితులు ఉంటే వెంటనే 1930కు ఫిర్యాదు చేయాలని, తద్వారా డబ్బు రికవరీ చేసే అవకాశం ఉందని ఆయన సూచించారు.
BDK: అశ్వారావుపేట శాంతిభద్రతల విషయంలో రాజకీయ ఒత్తిడులకు లోను కావద్దని డీఎస్పీ సతీష్ కుమారుకు ఎమ్మెల్యే జారే ఆదినారాయణ సూచించారు. శనివారం స్థానిక క్యాంపు కార్యాలయంలో లా అండ్ ఆర్డర్ పై సమీక్ష నిర్వహించారు. ప్రతీ ఫిర్యాదును పరిశీలించి విచారించాలన్నారు. ఈ కార్యక్రమంలో సీఐ కరుణాకర్, ఎస్సై యయాతి రాజులు పాల్గొన్నారు.
PDPL: మున్సిపల్ ఛైర్మన్ దాసరి మమత అధ్యక్షతన శనివారం కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ పరిధిలోని పలువురు కౌన్సిలర్లు హాజరయ్యారు. తమ వీధిలోని సీసీ రోడ్ల నిర్మాణం, మురికి కాలువల నిర్మాణం, పలు సమస్యలు సమావేశంలో ప్రస్తావించారు. సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకుని పనులు చేపట్టి పూర్తిచేయాలని కోరారు.