BDK: ఫిబ్రవరి 15న సేవాలాల్ జయంతి నాడు సెలవు ఇవ్వాలని భద్రాద్రి జిల్లా విద్యాశాఖ అధికారికి TSTTF జిల్లా బృందం బుధవారం వినతిపత్రం అందించారు. అదేవిధంగా కుల గణన సర్వే చేసిన టీచర్లకు రెమ్యూనరేషన్‌తో పాటు ఐదు రోజుల CCL మంజూరు చేయాలని కోరారు. TOSS 2022–24 మధ్య కాలంలో వేసవి సెలవుల్లో పనిచేసిన ఉపాధ్యాయులకు ELS మంజూరు చేయాలన్నారు.
WGL: గీసుకొండ మండలం ఎలుకుర్తి హవేలీ గ్రామంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం బ్రహ్మోత్సవాలలో భాగంగా బుధవారం ఉదయం గణపతి పూజ, పుట్ట మట్టకి వెళ్లడం, మధ్యాహ్నం హోమం కార్యక్రమం, సాయంత్రం వేళలో ఎదుర్కోలు, స్వామివారి కల్యాణం ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలన్నారు.
WNP: ఆత్మహత్య చేసుకునేందుకు శ్రీశైలం వచ్చిన ఓ యువతిని స్థానిక పోలీసులు కాపాడారు. సీఐ ప్రసాదరావు వివరాల మేరకు.. వనపర్తి జిల్లా ఓ గ్రామానికి చెందిన ఓ యువతి ఆత్మహత్య చేసుకునేందుకు శ్రీశైలం వచ్చింది. పాతాళగంగ వద్ద తిరుగుతున్న ఆమెను పోలీస్ సిబ్బంది గుర్తించి వివరాలు తెలుసుకున్నారు. వారి బంధువులకు క్షేమంగా అప్పగించామని సీఐ తెలిపారు.
NRML: జిల్లాలోని గోదావరి, స్వర్ణ, శుద్ధవాగు పరిసర ప్రాంతాల నుంచి అక్రమ ఇసుక రవాణా జరుగుతుందని ఈ ప్రాంతాలపై నిఘాను పటిష్టం చేసామని జిల్లా ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. జిల్లాలో 17 ఇసుక రీచ్‌లు, 35 ఇసుక నిల్వలు ఉన్నాయని తెలిపారు. అనుమతులు లేకుండా ఇసుకను నిల్వ ఉంచిన రవాణా చేసిన చర్యలు తప్పవని బుధవారం ప్రకటనలో హెచ్చరించారు.
SRD: మహిళల సంక్షేమం కోసం ఇచ్చిన పూర్తి హామీలు సత్వరమే అమలు చేయకపోతే ప్రజాక్షేత్రంలో నిలదీస్తామని సంగారెడ్డి జిల్లా BRS నేత చింతల గీతారెడ్డి అన్నారు. ప్రతి మహిళకు నెలకు రూ 2500, తులం బంగారం, స్కూటీ తదితర హామీలు ఎక్కడ పోయాయని ప్రశ్నించారు. మహిళా దినోత్సవంలోపల హామీలు అమలుపై కార్యక్రమం ప్రకటించకపోతే ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుడతామని హెచ్చరించారు.
SRD: చిలుకూరు దేవస్థానం ప్రధాన అర్చకులు రంగరాజన్‌పై దాడి అమానుషమని సంగారెడ్డి జిల్లా వైష్ణవ సంఘం అధ్యక్షులు కందాడై వరదాచార్యులు ఖండించారు. ధర్మ పరిరక్షకులపై జరుగుతున్న దాడులను ప్రతిఘటిస్తున్నట్లు పేర్కొన్నారు. ధర్మం న్యాయం కోసం పాటుపడే ఇలాంటి అర్చకులపై దాడి చేయడం దారుణమని ఆవేదనతో అన్నారు. సనాతన ధర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి భక్తుడిపై ఉందన్నారు.
SRD: స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి మండలాల వారిగా శిక్షణ కార్యక్రమాలను ఈ నెల 13, 14 తేదీల్లో నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ వల్లూరు క్రాంతి బుధవారం ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే శిక్షణ అధికారులను మండలాల వారిగా ప్రకటించినట్లు చెప్పారు. ఆర్వో ఏఆర్వోలుగా నియామకమైన ఉపాధ్యాయులు ఆయా మండలాల్లో శిక్షణకు హాజరుకావాలని సూచించారు.
KMR: TSCPSEU రాష్ట్రశాఖ పిలుపు మేరకు కేంద్రప్రభుత్వం తెచ్చిన UPS విధానానికి వ్యతిరేకంగా మార్చి 2న HYD ధర్నాచౌక్‌లో నిర్వహించే యుద్ధభేరి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. జిల్లా అధ్యక్షుడు కుంట ఎల్లారెడ్డి దీనికి సంబంధించిన గోడపత్రులను మంగళవారం సాయంత్రం ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. కేంద్రం ప్రభుత్వం తెస్తున్న UPS విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు.
MHBD: గూడూరు మండలం మర్రిమిట్ట గ్రామ సమీపంలోని నేషనల్ హైవేపై మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాలు.. మహబూబాబాద్-నర్సంపేట నేషనల్ హైవేపై ద్విచక్ర వాహనాలు ఢీకొట్టడంతో ఇండ్ల రమేశ్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రున్ని గూడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
NZB: ఎమ్మెల్సీ ఎన్నికలలో బీజేపీ యువ మోర్చా కీలక పాత్ర పోషించాలని BJYM రాష్ట్ర అధ్యక్షుడు సెవేళ్ల మహేందర్ పిలుపునిచ్చారు. మంగళవారం నిజామాబాద్‌లోని జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ఎన్నికల సన్నాహక సమావేశంలో మహేందర్ మాట్లాడారు. శాసనమండలిలో ప్రశ్నించే గొంతుకలు ఉండాలనే ఆలోచనతో పార్టీ నాయకత్వం బలమైన అభ్యర్థులను నిలబెట్టిందన్నారు.
NGKL: అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక రవాణా చేస్తే చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ వైభవ్ రఘునాథ్ గైక్వాడ్ హెచ్చరించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అనుమతులు లేకుండా ఎవరైనా అక్రమంగా మైనింగ్ చేస్తే వారిపై ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం, మైనింగ్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.
NGKL: జిల్లా కేంద్రంలోని నేషనల్ ఐ.టీ.ఐ కళాశాలలో ఈనెల 12వ జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధికల్పన అధికారి బి.రాఘవేందర్ సింగ్ ఒక ప్రకటనలో తెలిపారు. 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ, డి. ఫార్మసి, బి. ఫార్మసీ, డిప్లొమో ఇన్ అగ్రికల్చర్, డిప్లొమో ఇన్ హార్టి కల్చర్ చదివిన 18 నుంచి 35 ఏళ్లలోపు వయసు ఉన్న నిరుద్యోగులు అర్హులన్నారు. ఈ ఆవకాశంను నిరుద్యోగులు వినియోగించుకోవాలన్నారు.
JGL: వేములవాడ నియోజకవర్గం పరిధిలోని భీమారం మండలం మన్నెగూడెం గ్రామంలో శ్రీ మల్లికార్జున స్వామి వారి జాతర మహోత్సవంలో ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. స్థానిక నాయకులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు ప్రభుత్వ విప్‌ను ఘనంగా సన్మానించారు.
KNR: శంకరపట్నం మండలం కరీంపేట గ్రామంలో 100 డేస్ TB ప్రోగ్రాంలో భాగంగా గ్రామ ప్రజలకు TBపై అధికారులు అవగాహన కల్పించారు. కరీంపేటలో 21 శాంపిల్స్, ఇప్పలపల్లిలో14, అంబాలాపూర్ 12 శాంపిళ్లను సేకరించినట్లు మండల వైద్యాధికారి డాక్టర్ శ్రావణ్ తెలిపారు. ఆకలి మందగించడం, అతిగా చెమటలు రావడం, బరువు తగ్గడం, 3 వారాలకు మించి దగ్గు లాంటి లక్షణాలు ఉంటే వైద్యులను సంప్రదించాలని సూచించారు.
MLG: జిల్లాలో విషాదం నెలకొంది. కన్నాయిగూడెం మండలం తుపాకులగూడెంలో పురుగు మందు తాగి భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకున్నారు. భర్త ఆలెం స్వామి, భార్య అశ్విత మృతి చెందారు. కుటుంబ కలహాలే ఆత్మహత్యకు కారణంగా తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.