NZB: నగరశివారులో ఓ మహిళదారుణ హత్యకు గురైంది. ఈ ఘటన శుక్రవారం ఉదయం సారంగాపూర్ వడ్డెర కాలనీలో వెలుగు చూసింది. కాలనీకి చెందిన దుబ్బాక సాయమ్మకు నలుగురు సంతానం. ముగ్గురికి వివాహం కాగా చిన్నకొడుకు దుబాయ్‌లో ఉంటున్నాడు. భర్త చనిపోవడంతో ఇంట్లో ఒంటరిగా ఉంటున్న మహిళ హత్యకు గురైంది. విషయం తెలుసుకున్న 6వ టౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
BPL: జిల్లా మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డిని శుక్రవారం పరకాలలోని వారి నివాసంలో శాయంపేట బీఆర్ఎస్ పార్టీ మండల నాయకులు కలిసి పుష్పగుచ్చాలు అందజేసి, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మెతుకు తిరుపతిరెడ్డి, మండల అధ్యక్షులు గంగుల మనోహర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
NZB: ఇందల్వాయి ఎస్సై మనోజ్ అవినీతికి పాల్పడుతున్నట్లు ఐజీకి శుక్రవారం ఫిర్యాదు అందింది. ఈ అంశం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఎస్సై మనోజ్ సొంతంగా జేసీబీలను ఏర్పాటు చేసి లింగాపూర్, గౌరారం వాగులలో ఇసుక తవ్వించి.. జైపాల్ నాయక్, శ్రీను, రమేశ్ అనే వ్యక్తుల ద్వారా అక్రమంగా రవాణా చేస్తున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
JN: పాలకుర్తి మండల కేంద్రంలోని ఊర చెరువులో చనిపోయిన గోవులను కొందరు గుర్తుతెలియని వ్యక్తులు విచ్చలవిడిగా పడేశారు. దీంతో దుర్వాసన వస్తుందని చుట్టుపక్కల ప్రజలు వాపోయారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి మరోసారి ఇలా జరగకుండా చూడాలని కోరారు. అలా వేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.
కామారెడ్డి గ్రామీణం మండలం ప్రమాదవశాత్తు కంటెయినర్ లారీ దగ్ధమైన ఘటన కామారెడ్డి మండలం టేక్రియాల్ వద్ద జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున 5 గంటలకు చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి ఎలక్ట్రికల్ స్క్రాప్ తో నాగపూర్ వెళ్తున్న కంటెయినర్లో టేక్రియాల్ స్టేజ్ వద్దకు రాగానే మంటలు వచ్చాయి.
WGL: గీసుగొండకు చెందిన బీఆర్ఎస్ కార్యకర్త దౌడు బాబు ఇటీవల ప్రమాదవశాత్తు మృతి చెందారు. కాగా పార్టీ సభ్యత్వానికి చెందిన రూ.2 లక్షల భీమా చెక్కును పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి శుక్రవారం హనుమకొండలోని వారి నివాసంలో అందజేశారు. వారు మాట్లాడుతూ.. దేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా కార్యకర్తలకు భీమా సదుపాయం కల్పించలేదని అన్నారు.
WGL: ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ లో నేడు పత్తి ధర మరోసారి రూ.7 వేల మార్క్ దాటింది. బుధవారం క్వింటా పత్తి ధర రూ.6,970 పలకగా, నేడు రూ. 7020 పలికినట్లు అధికారులు తెలిపారు. నేడు మార్కెట్‌కు పత్తి అధిక సంఖ్యలో తరలిరాగా, మార్కెట్లో క్రయవిక్రయాలు జోరుగా కొనసాగుతున్నాయి.
NRML: రోడ్డు నిబంధనలు పాటించి వాహనదారులు వాహనాల నడపాలని ఎంవీఐ మూర్తుజా అలీ అన్నారు. నిర్మల్ పట్టణంలోని బస్టాండ్ ప్రాంతంలో జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల భాగంగా వాహనదారులకు వాహన నిబంధనల పై అవగాహన కల్పించారు. నిబంధనలు పాటించి వాహనాలు నడిపినట్లయితే ప్రమాదాలను పూర్తిగా నివారించవచ్చని తెలిపారు. కార్యక్రమంలో రవాణా శాఖ అధికారులు పాల్గొన్నారు.
ASF: ఇటీవల బదిలీల్లో భాగంగా కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాకు నూతన ఏఎస్పీగా నియమితులైన చిత్తరంజన్ గురువారం ఎస్పీ శ్రీనివాస రావును మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్క అందజేశారు. అనంతరం ఆసిఫాబాద్ నూతన ఏఎస్పీగా బాధ్యతలు తీసుకున్నారు.
MNCL: చెన్నూర్ వ్యవసాయ మార్కెట్ పరిధిలో తాత్కాలికంగా పత్తి కొనుగోలును బంద్ చేస్తున్నట్లు మార్కెట్ కమిటీ కార్యదర్శి రామాంజనేయులు తెలిపారు. జిన్నింగ్ మిల్లులో పత్తి నిలువలు పేరుకుపోయాయని జనవరి 2 నుంచి 3 వరకు పత్తి కొనుగోలు నిలిపివేస్తున్నట్లు తెలిపారు. 4, 5వ తేదీల్లో సాధరణ సెలవులు కావడంతో పత్తి కొనుగోలు బంద్ ఉంటుందని తెలిపారు.
ADB: కడెం ప్రాజెక్టు ప్రస్తుత నీటి వివరాలను ప్రాజెక్టు అధికారులు గురువారం ఉదయం వెల్లడించారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం 700 అడుగులు కాగా, ప్రస్తుతం 694 అడుగుల నీటిమట్టం నిల్వ ఉందన్నారు. ఎగువ ప్రాంతాల నుంచి ప్రాజెక్టులోకి 95 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుందని, లెఫ్ట్ కెనాలు 50, మిషన్ భగీరథకు 9 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు తెలిపారు.