KNR: కరీంనగర్ ఆర్టీసీ బస్టాండ్ ఇన్ గేట్ వద్ద పోగొట్టుకున్న బ్యాగును బాధితురాలికి అందించినట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. తీగలగుట్టపల్లికి చెందిన శైలజ కొంత నగదు, మూడు తులాల బంగారు ఆభరణాలు ఉన్న బ్యాగును బస్టాండ్ ఇన్గెట్ వద్ద పోగొట్టుకున్నారు. అక్కడే విధులు నిర్వహిస్తున్న అశ్విని అనే మహిళా ట్రాఫిక్ కానిస్టేబుల్ బ్యాగుని అందజేశారు.