NZB: కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా నరేందర్ రెడ్డి సోమవారం నామినేషన్ వేశారు. కరీంనగర్ కలెక్టరేట్లో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, ఉర్దూ అకాడమీ ఛైర్మన్ తాహెర్ బిన్ హందాన్, మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి పాల్గొన్నారు.
MNCL: పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ట్రస్మా రాష్ట్ర అధ్యక్షులు యాదగిరి శేఖర్ రావు నామినేషన్ వేశారు. జన్నారం మండలంలోని కలమడుగు గ్రామానికి చెందిన యాదగిరి శేఖర్ రావు సోమవారం కరీంనగర్ పట్టణంలోని కలెక్టరేట్‌లో కలెక్టర్ పమేలా సత్పతికి నామినేషన్ పత్రాలను అందించారు. శేఖర్ రావు మాట్లాడుతూ నిరుద్యోగులు, పట్టభద్రుల సమస్యలను పరిష్కరించడానికి నామినేషన్ వేశానన్నారు.
NRML: పన్ను వసూలు త్వరిత గతిన పూర్తిచేయాలని అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ అధికారులను ఆదేశించారు. నిర్మల్, ఖానాపూర్, బైంసా మున్సిపాలిటీలలో ఆస్తి, వాణిజ్య, నీటి, వ్యాపార ప్రకటనల పన్నుల వసూలును వంద శాతం పూర్తి చేయాలని ఆదేశించారు. పన్ను వసూలు లక్ష్యం, ఇప్పటి వరకు పూర్తి చేసిన వసూలు వివరాలను మునిసిపాలిటీల వారిగా అధికారులను అడిగి తెలుసుకున్నారు.
KMR: ఎల్లారెడ్డి తాడ్వాయి మండలం బ్రహ్మాజీవాడి గ్రామంలో సోమవారం రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ బక్కి వెంకటయ్య పర్యటించారు. గ్రామంలో కొనసాగుతున్న మల్లన్న ఉత్సవాలకు దళితులకు రానివ్వలేదని సామాజిక జిక మధ్యమాల్లో వైరల్ కావడంతో ఆగ్రామాన్ని సందర్శించి వివరాలను తెలుసుకున్నారు. ఈ సందర్బంగా అయిన మాట్లాడుతూ.. కుల వివక్షత చూపవద్దని అందరూ కలిసి మెలిసి ఉండాలన్నారు.
KMR: ఎమ్మెల్సి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి గెలుపు కోసం పని చేయాలనీ పెద్దపల్లి జిల్లా ఇంఛార్జ్ సురభి నవీన్ కుమార్ కోరారు. పెద్ద పల్లి జిల్లా రామగుండంలో సోమవారం కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్, ఎమ్మెల్సి అభ్యర్థి అంజీ రెడ్డికి మద్దతుగా జరిగిన సమావేశంలో అయినా మాట్లాడారు. పార్టీ గెలుపు కోసం బీజేపీ నాయకులు కష్టపడాలి అన్నారు.
RR: సరూర్‌నగర్ డివిజన్ పరిధిలో నెలకొన్న డ్రైనేజీ సమస్యలను పరిష్కరించాలని స్థానిక కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి అంజన్ కోరారు. ఈ విషయమై ఆమె ఇవాళ HMWS ఎస్బీ జనరల్ మేనేజర్ శ్రీనివాస్ రెడ్డిని, మేనేజర్ ప్రవీణ్‌ను మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. మురుగునీటి పూడికతీత, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పునరుద్ధరణ పనులు చేపట్టాలని పేర్కొన్నారు.
HYD: జాంబాగ్ డివిజన్ పరిధిలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాన్ని గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రారంభించారు. ఆదివారం నిర్వహించిన ఈ వైద్య శిబిరంలో ఉచితంగా మందులు పంపిణీ చేసి, వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్య శిబిరం నిర్వహించిన నిర్వాహకులను ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు.
NZB: KCR పాలన ఐఫోన్‌లా ఉంటే రేవంత్ పాలన చైనా ఫోన్‌లా ఉందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎద్దేవా చేశారు. సోమవారం ఆమె మాట్లాడుతూ.. ఐఫోన్, చైనా ఫోన్‌కు ఎంత తేడా ఉంటదో.. KCRకు, రేవంత్ రెడ్డికి అంత తేడా ఉందని, చైనా ఫోన్ చూడడానికి బాగుంటుంది కానీ సరిగ్గా పనిచేయదన్నారు. మాయ మాటలు చెప్పి బీసీలఓట్లు వేయించుకొని సీఎం రేవంత్ రెడ్డి బురిడి కొట్టించారని ధ్వజమెత్తారు.
BDK: వెదురు సాగు చేయడం వల్ల రైతుల ఇంట సిరుల పంట పడినట్టేనని జిల్లా కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ అన్నారు. సోమవారం ఐడీఓసీ కార్యాలయం మినీ సమావేశ మందిరంలో ఇండస్ట్రీ క్రాఫ్ట్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో చండ్రుగొండ, ములకలపల్లి, గుండాల మండలాల ఏపీఎంలు, ఏపీవోలు, సీసీలు, ఎఫ్‌పీసీలు, వీవో ఏసీలు, అటవీ శాఖ సిబ్బందికి వెదురు పెంపకంపై శిక్షణా తరగతులు నిర్వహించారు.
NGKL: ఉప్పునుంతల మండలంలోని మామిళ్లపల్లి గ్రామంలో ఇవాళ గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ ముఖ్య అతిథిగా భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి గ్రామం అభివృద్ధి చెందుతుందని అన్నారు. మార్కెట్ కమిటీ ఛైర్మన్ మల్లేష్, లక్ష్మి నరసింహ టెంపుల్ ఛైర్మన్ నరసింహ రావు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
MNCL: జన్నారం మండలంలో మొత్తం 44,260 మంది ఓటర్లు ఉన్నారని ఎంపీడీవో ఉమర్ షరీఫ్ తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సోమవారం మండల ఓటర్ల జాబితాను విడుదల చేశారు. మండలంలో ఒక జడ్పీటీసీ, 15 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. మండలంలో మొత్తం 44,260 మంది ఓటర్లు ఉన్నారు. వారిలో 21,620 పురుషులు, 22,638 మహిళలు, ఇద్దరు ఇతర ఓటర్లు ఉన్నారన్నారు.
NRML: ప్రజా సమస్యల పరిష్కారం కోసమే ఫిర్యాదులను స్వీకరిస్తున్నామని జిల్లా ఎస్పీ జానకి షర్మిల అన్నారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ఫిర్యాదుల విభాగంలో ఆమె పాల్గొన్నారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల ఫిర్యాదులను స్వీకరించారు. సమస్యలను అడిగి తెలుసుకుని సంబంధిత పోలీస్ స్టేషన్‌లకు ఫోన్ చేసి సమస్య పరిష్కరించేలా కృషి చేయాలన్నారు.
NRML: ఖానాపూర్ నియోజకవర్గంలో సోమవారం అభిలాష అభినవ్ ఆకస్మికంగా పర్యటించారు. ఈ సందర్భంగా పలు వార్డులను తిరుగుతూ సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రజల సమస్యలను త్వరలోనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను వారు ఆదేశించారు. వీరి వెంట స్థానిక అధికారులు, పలువురు నాయకులు పాల్గొన్నారు.
NLG: నార్కట్‌పల్లి మండల పరిధిలోని చెరువుగట్టు శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. సోమవారం సందర్భంగా శివలింగానికి అభిషేకం చేసి, స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించారు. భూపాల్ రెడ్డి దంపతులకు ఆలయ అర్చకులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.
MNCL: నిరుద్యోగులకు మేలు చేయడానికే అప్రెంటిషిప్ మేళాను ఏర్పాటు చేయడం జరిగిందని జన్నారం ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్ బీ.రాములు అన్నారు. సోమవారం మధ్యాహ్నం జన్నారం పట్టణంలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ఐటీఐ పూర్తి చేసిన నిరుద్యోగుల కోసం ఏర్పాటు చేసిన ప్రధానమంత్రి జాతీయ అప్రెంటిషిప్ మేళాను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు న్నారు.