గ్రేటర్ HYD పరిధిలోని అనేక ప్రాంతాల్లో టాయిలెట్ల నిర్వహణ మూలకు పడింది. లక్షల రూపాయలు వెచ్చించి అనేక చోట్ల టాయిలెట్లు ఏర్పాటు చేసినప్పటికీ ఫలితం లేకుండా పోతుంది. ఉప్పల్, చిల్కానగర్, నారాయణగూడ, ఎల్బీనగర్ సహా అనేక ప్రాంతాల్లో ఇదే పరిస్థితి ఉందని, దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.