RR: తలకొండపల్లి ఎమ్మార్వో నాగార్జున రైతుదగ్గర రూ.10వేలు లంచం తీసుకుంటుండగా మంగళవారం సాయంత్రం ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. అంతారం గ్రామానికి చెందిన రైతు వద్ద పొలం మార్పిడి కోసం రూ.1,50,000 బేరం కుదుర్చుకొని అడ్వాన్సుగా రూ.10,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు ఆయనను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.