MBNR: కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రైతుల దినస్థితి హృదయ విధారకంగా ఉందని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం కొత్త గన్ని బ్యాగులో కొనుగోలు చేశామని చెబుతున్న క్షేత్రస్థాయిలో నాసిరకం బ్యాగులు వాడటం వల్ల అక్కడ కూడా రైతులు తలకు కోల్పోవడంతో పాటు తేమ, తాళ్లు అంటూ తరుగు కోల్పోవడంతో రైతుల తీవ్ర నష్టం ఎదుర్కొంటున్నారని అన్నారు.
BHPL: గోరికొత్తపల్లి మండల కేంద్రంలో మే 1న మేడే కార్మిక దినోత్సవం జరపనున్నట్లు భవన నిర్మాణ కార్మిక మండల అధ్యక్షుడు పసుల రాకేశ్ వెల్లడించారు. హనుమాన్ ఆలయం వద్ద కార్మిక జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. గ్రామస్థులు, రాజకీయ నాయకులు, భవన నిర్మాణ, ఆటో, ట్రాక్టర్ యూనియన్ కార్మికులు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఆయన కోరారు.
MDK: ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులకు ముఖ్య గమనిక. వేసవి సెలవుల్లో భాగంగా క్యాంపస్లోని హాస్టల్స్, మెస్లను మూసివేస్తున్నారు. జూన్ 1న రీఓపెన్ చేస్తామని చీఫ్ వార్డెన్ సర్క్యూలర్ జారీ చేశారు. రేపటి నుంచి మే 31 వరకు ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటాయి. అన్ని విభాగాల విద్యార్థులు గమనించాలని సూచించారు.
NGKL: కల్వకుర్తి మండలంలోని గుండూరులో 40 ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించినట్లు బుధవారం ఎంపీడీవో వెంకట రాములు తెలిపారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇల్లు వస్తాయని ఆయన అన్నారు. ఎంపీడీవో వెంట ఇందిరమ్మ కమిటీ మండల పర్యవేక్షకులు విజయభాస్కర్, సిబ్బంది ఫిరోజ్ ఖాన్, రాఘవేందర్ పంచాయతీ కార్యదర్శి వీరస్వామి, తదితరులు పాల్గొన్నారు.
NGKL: రాష్ట్రంలోని వివిధ పుణ్యక్షేత్రాలలో ఉన్న ఆన్‌లైన్ సేవల మాదిరిగానే శ్రీశైలం ఉత్తర ద్వారంగా ప్రసిద్ధి చెందిన ఉమామహేశ్వర దేవాలయంలో బుధవారం ఆన్‌లైన్ సేవలను ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ప్రారంభించారు. దీని ద్వారా రాష్ట్రంలోనే వివిధ ప్రాంతాల భక్తులతో పాటు దేశ విదేశాలలో ఉన్న భక్తులు సైతం ఈ ఆన్‌లైన్ సేవలను ఉపయోగించుకోవాలన్నారు.
BDK: మాదక ద్రవ్యాలు రవాణా చేస్తున్నారన్న సమాచారం మేరకు రైల్వే పోలీసులు బుధవారం కొత్తగూడెం రైల్వే స్టేషన్‌లో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రయాణికుల సామానులను పరిశీలించి, అనుమానాస్పద వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారించారు. మాదకద్రవ్యాలు రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.
SRD: మండల కేంద్రమైన కంగ్టి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న సిహెచ్ఓ గాలన్నకు రిటైర్మెంట్ పత్రాన్ని స్థానిక మెడికల్ ఆఫీసర్ డాక్టర్ నాగమణి బుధవారం అందజేశారు. ఏప్రిల్ 30న ఆయన పదవి విరమణ అవుతున్నారు. గత 14 ఏళ్లుగా సుదీర్ఘంగా బాధ్యతతో విధులు నిర్వహించిన ఈయనకు వైద్యాధికారి అభినందనలు తెలిపారు.
MBNR: జడ్చర్ల నియోజకవర్గం నవాబ్ పేట మండలం తీగలపల్లి, ఇప్పోనిబాయిలో బుధవారం శ్రీ హనుమాన్ దేవాలయముల విగ్రహముల, ధ్వజస్తంభ ప్రతిష్టణాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి హాజరై ప్రత్యేక పూజ నిర్వహించారు. శ్రీ ఆంజనేయ స్వామి వారిని దర్శించుకున్నారు.
MBNR: సింహాచలంలో భక్తులు మృతి చెందడం ఎంతో బాధాకరమైన విషయమని మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యురాలు డీకే అరుణ బుధవారం ఒక ప్రకటన ద్వారా వెల్లడించారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానన్నారు. మృతుల ఆత్మలకు శాంతి చేకూరాలని తెలిపారు. ప్రభుత్వం మృతుల కుటుంబాలకు అండగా నిలవాలని అన్నారు.
NRML: జిల్లాలోని 30 గ్రామాలను ఆరెంజ్ జోన్‌లో చేర్చినట్లు వాతావరణ శాఖ అధికారులు మంగళవారం వెల్లడించారు. జిల్లాలోని దస్తూరాబాద్ మండలంలో అత్యధికంగా 44.3 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. 40 డిగ్రీలకు పైన ఉన్న గ్రామాలను అధికారులు ఆరెంజ్ జోన్‌లో ప్రకటించారు. ఇది వరకు జిల్లాలోని ఐదు గ్రామాలు రెడ్ జోన్‌లో సైతం ఉన్న విషయం తెలిసిందే.
NRML: భైంసాలో పక్కా సమాచారం మేరకు పట్టణ పోలీసులు మంగళవారం సాయంత్రం ఆకస్మిక దాడులు నిర్వహించారు. అక్రమంగా గంజాయిని అమ్ముతున్న ముజామిల్ హుస్సేన్‌ను పట్టుకున్నారు. అతడి నుంచి 1.400 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకొని అరెస్ట్ చేశారు. అక్రమ దందాలను కొనసాగిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని ఎస్సై గణేశ్ హెచ్చరించారు.
BHPL: జిల్లా కేంద్రంలోని సింగరేణి ఏరియాలో మంగళవారం జీఎం సెక్యూరిటీ లక్ష్మినారాయణ విస్తృతంగా పర్యటించారు. వారు మాట్లాడుతూ.. ముఖ్యంగా సింగరేణి స్థలాలు కబ్జా కాకుండా ఫెన్సింగ్ వేయించాలన్నారు. రికార్డులను తనిఖీ చేసి, సోలార్ ప్లాంట్‌లో భద్రతా చర్యలను పర్యవేక్షించారు. ఉప్పల్ నుండి బొగ్గు రవాణాను పరిశీలించి పలు సూచనలు చేశారు.
BHNG: జిల్లా కాంగ్రెస్ పార్టీ DCC ఎస్టీ సెల్ జిల్లా వైస్ ప్రెసిడెంట్‌గా తుర్కపల్లి మండలంలోని గుజ్జ వాణి కుంట తండా గ్రామ పంచాయితీకి చెందిన గుగులోత్ దూప్ సింగ్ నాయక్ మంగళవారం నియమితులైనట్లు డీసీసీ అధ్యక్షుడు తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్, ఆలేరు MLA బీర్ల ఐలయ్య, మదర్ డైరీ ఛైర్మన్ గుడిపాటి మధుసూదన్ రెడ్డి, పలువురు ఆయనను ఘనంగా సన్మానించారు.
SRPT: జిల్లా వ్యాప్తంగా అనేక గ్రామాలలో త్రాగునీటికి సమస్య తీవ్రంగా ఉందని తాగునీటి ఎద్దడి నివారణకు చర్యలు చేపట్టాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి అన్నారు. మంగళవారం సూర్యాపేటలో మల్లు వెంకట నరసింహారెడ్డి భవన్‌లో సీపీఎం జిల్లా కేంద్ర కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కలెక్టర్ తేజస్ స్పందించి నీటి సమస్యను పరిష్కరించాలని అన్నారు.
MDK: బసవ జయంతి సందర్భంగా సదాశివపేట పట్టణంలో స్థానిక బసవ సేవ సాధన్‌లో వీరశైవ సమాజం ఆధ్వర్యంలో మంగళవారం కుస్తీ పోటీలు నిర్వహించారు. ఈ కుస్తీ పోటీలో వివిధ ప్రాంతాల మల్లయోధులు పాల్గొని కుస్తీలు పట్టారు. అనంతరం వీరశైవ సమాజం సభ్యులు విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో వీరశైవ సమాజం సభ్యులు పాల్గొన్నారు.