WGL: ప్రతిభ గల క్రికెటర్లను గుర్తించడానికి తెలంగాణ గోల్డ్ కప్-2025 క్రికెట్ టోర్నీ నిర్వహిస్తున్నట్లు తెలంగాణ క్రికెట్ సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు డా.విజయ చందర్ రెడ్డి తెలిపారు. జనవరి 8 నుంచి 18 వరకు హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల, మొగిలిచర్లలోని క్రికెట్ మైదానాల్లో టీ- 20 ఫార్మాట్‌లో పోటీలు ఉంటాయని తెలిపారు.
NZB: నిజామాబాద్ నగరంలో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌లో కేసుల పరిష్కారంలో విశేష కృషి చేసిన 3వ టౌన్ ఎస్సై నర్సయ్యకు ప్రతిభా పురస్కారం దక్కింది. NZB నగరంలోని కోర్టులో జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల నర్సయ్యకు ప్రశంసాపత్రం అందించి సత్కరించారు. ఈ సందర్భంగా ఆయనను పోలీసు ఉన్నతాధికారులు, సిబ్బంది అభినందించారు.
ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం అజ్మీరాతండా శివారు బోర్సుగడ్డ తండాలోని ఓ ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన 100 క్వింటాళ్ల రేషన్ బియ్యం స్థానిక పోలీసులు పట్టుకున్నారు. అనంతరం సివిల్ సప్లై అధికారులకు అప్పగించారు. బోర్సుగడ్డ తండాకు చెందిన సురేష్, నరేష్, పిండిప్రోలుకు చెందిన శంకర్, రామకృష్ణలపై కేసు నమోదు చేశారు.
NZB: స్టేట్ టీచర్స్ యూనియన్ నూతన సంవత్సర డైరీని డీఈవో అశోక్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ధర్మేందర్, శ్రీకాంత్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీనివాస్, రాష్ట్ర కార్యదర్శి వాసు, జిల్లా ఆర్థిక కార్యదర్శి అఫ్జల్ బేగ్, కార్యవర్గ సభ్యులు బాలచంద్రం, రమేష్, మహేశ్వర్, కాంతారావు, యాదగిరి, రత్నాకర్, మల్లయ్య ఉన్నారు.
NZB: న్యూ ఇయర్ అర్ధరాత్రి మద్యం తాగి అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని NZB ఇంఛార్జ్ ఎస్పీ సింధు శర్మ హెచ్చరించారు. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకొని నగరంలో 20 పోలీసు బృందాలను ఏర్పాటు చేసి, వాహనాల తనిఖీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. DEC 31న రాత్రి 12:30 తర్వాత ఎవరైనా గుంపులు గుంపులుగా ఉంటే వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
NGKL: వంగూరు మండల కేంద్రంలో సోమవారం సీపీఎం నేతలు నిరసన ప్రదర్శన నిర్వహించారు. రాజ్యాంగ నిర్మాత బీ.ఆర్ అంబేడ్కర్‌ను అవమానించిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను.. మంత్రివర్గం నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి బాలస్వామి, జిల్లా కార్యవర్గ సభ్యుడు చింత ఆంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.
MBNR: రాష్ట్ర ప్రభుత్వం క్రీడలను అభివృద్ధి చేయడానికి అనేక కార్యక్రమాలు చేపట్టిందని మాజీ ఎంపీ, ఒలంపిక్ సంఘం అధ్యక్షుడు ఏపీ జితేందర్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలో సీఎం కప్ బాలికల కబడ్డీ పోటీలను ఆయన సోమవారం ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత క్రీడలకు ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తుందని తెలిపారు.
BDK: గంజాయి నియంత్రణలో భాగంగా సోమవారం అశ్వాపురం మండలంలో నార్కోటిక్ డాగ్ స్క్వాడ్ రీనాతో కలిసి పోలీసులు ఆకస్మిక సోదాలు నిర్వహించారు. మండలంలో గంజాయి సప్లై చేస్తున్నారనే సమాచారంతో ఈ తనిఖీలు చేపట్టినట్లు సీఐ అశోక్ రెడ్డి తెలిపారు. గంజాయి సేవించే అనుమానిత వ్యక్తుల ఇండ్లను, ఖాళీ స్థలాల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు.
NGKL: జిల్లాలో టీబీ వ్యాధి నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని డిప్యూటీ డీఎంహెచ్‌ఓ వెంకట దాస్ అన్నారు. తాడూరు PHC పరిధిలో సోమవారం నిర్వహించిన ముక్తభారత్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వైద్య ఆరోగ్య సిబ్బందితో కలిసి ప్రజలకు అవగాహన కల్పించారు. వంద రోజుల్లో టీబీ వ్యాధిని పూర్తిగా నిర్మూలించడమే లక్ష్యంగా కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు.