BDK: జిల్లాలో రెండవ విడత గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా ప్రశాంతంగా ముగిసిందని కలెక్టర్ జితేష్ వీ.పాటిల్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. 7 మండలాల్లో 1,96,395 మంది ఓటర్లకు గాను 1,62,323 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. మొత్తం పోలింగ్ శాతం 82.65గా నమోదైంది అని అన్నారు.