JGL: కోరుట్ల, మెట్‌పల్లి డివిజన్ పరిధిలో నిరంతరం పోలీస్ పెట్రోలింగ్ నిర్వహిస్తామని, డ్రంక్ & డ్రైవ్లో పట్టుపడితే కేసులు నమోదు చేస్తామని మెట్‌పల్లి డీఎస్పీ రాములు అన్నారు. సోమవారం స్థానిక డీఎస్పీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. చట్టాన్ని అతిక్రమించి డిసెంబర్ 31 రాత్రి రోడ్లపైన కేకులు కట్ చేయడం, బాణాసంచాలు పేల్చడం చేస్తే కఠినచర్యలు ఉంటాయని హెచ్చరించారు.
SRCL: వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో సోమవారం అమావాస్య కారణంగా భక్తుల రద్దీ తక్కువైంది. ప్రతి సోమవారం నిత్యం వేలాది మందిగా వచ్చి ఆలయ ధర్మగుండంలో స్థానమాచరించి కోడె మొక్కులు చెల్లించుకునేవారు. ఈసారి అమావాస్య సోమవారం కారణంగా భక్తులు ఎవరు రావకపోవడంతో ఆలయ పరిసరాలు బోసిపోయాయి.
NLG: నల్లగొండ ప్రభుత్వ మెడికల్ కళాశాల ఆసుపత్రిలోని డయాలసిస్, ఆర్థో తదితర వార్డులను సోమవారం నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్బంగా మెడికల్ కళాశాల ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ అరుణ కుమారితో మాజీ ఎమ్మెల్యే మాట్లాడారు. రోగులకు మరింత మెరుగైన వైద్య సౌకర్యం అందించేందుకు ప్రయత్నించాలని సూచించారు.
SRPT: జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ ఐపీఎస్ ఆదేశాల మేరకు సోమవారం పెన్ పహాడ్ మండల పరిధిలోని దోస పహాడ్ గ్రామంలోని మహాత్మ జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాల విద్యార్ధులకు సైబర్ నేరాల పైన, గంజాయి, డ్రగ్స్, రోడ్డు ప్రమాదాలపై పోలీస్ కళా బృందంతో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని పెన్ పహాడ్ మండల ఎస్సై గోపికృష్ణ తెలియజేశారు.
BDK: పాల్వంచ ముస్లిం మైనారిటీ సీనియర్ నాయకులు, నటరాజ్ జామా మజీద్ ఛైర్మన్ ఫయాజ్ భార్య అనారోగ్యంతో సోమవారం మరణించారు. ఈ విషయం తెలుసుకున్న రాష్ట్ర మార్క్ ఫెడ్ డైరెక్టర్, డీసీఎంఎస్ ఛైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు ఆమె భౌతికకాయానికి పూలమాల వేసి నివాళిర్పించారు. ఫయాజ్ కుటుంబ సభ్యులను పరామర్శించి, సానుభూతి తెలిపారు.
ADB: ఆదిలాబాద్ రూరల్ మండలంలోని చించుఘాట్ గ్రామంలో బాలల హక్కులు, బాల కార్మిక వ్యవస్థ, బేటి బచావో బేటి పడావో, తదితర అంశాలపై న్యూ రైన్ బో స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో గ్రామస్థులకు సోమవారం అవగాహన కల్పించారు. సంస్థ అధ్యక్షుడు కొమ్ము రాము మాట్లాడుతూ.. బడీడు పిల్లలు చదువుకు దూరం కాకుండా చూడాలన్నారు.
HYD: ఆధ్యాత్మిక చింతన అనేది ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని నల్లకుంట డివిజన్ కార్పొరేటర్ అమృత అన్నారు. సోమవారం డివిజన్ పరిధిలోని న్యూ నల్లకుంటలో నిర్వహించిన అయ్యప్ప స్వామి మహా పడిపూజలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా అయ్యప్ప స్వాములతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ప్రధాన పూజారులు ఆమెను ఆశీర్వదించి, తీర్థ ప్రసాదాలు అందజేశారు.
JN: తెలంగాణ భవన్‌లో మాజీ మంత్రి, బీఅర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా క్రిస్మస్, నూతన సంవత్సర శుభాకాంక్షలు కేటీఆర్‌కు తెలిపారు. అనంతరం స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ పరిస్థితులపై వారు చర్చించారు.
BDK: ములకలపల్లి మండలం తిమ్మంపేట ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యార్థులకు మండలానికి చెందిన పలువురు దాతల సహకారంతో ఉచిత సైకిళ్లు సోమవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు బీ. శంకర్ మాట్లాడుతూ.. విద్యార్థులకు సైకిల్ పంపిణీ ప్రోత్సాహకరమైన మంచి కార్యక్రమన్నారు. ఈ కార్యక్రమంలో దాతలు, గ్రామస్తులు పాల్గొన్నారు.
NRML: ఖానాపూర్ మండలంలోని చింతలపేట్ గ్రామాన్ని నూతన గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేయాలనీ మంత్రి సీతక్కకు.. ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ వినతి పత్రం సమర్పించారు. సోమవారం మధ్యాహ్నం హైదరాబాదులో మంత్రి సీతక్కను ఖానాపూర్ మండల అధికారులతో కలిసి ఆయన వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఖానాపూర్ మండల ఎంపిఓ రత్నాకర్ రావు, పంచాయతీ కార్యదర్శి పాల్గొన్నారు.
HNK: హన్మకొండ కనకదుర్గ కాలనీలోని ఎంపీ క్యాంపు కార్యాలయంలో లూయిస్ ఆదర్శ అంధుల పాఠశాల విద్యార్థులు రూపొందించిన 2025 నూతన సంవత్సర క్యాలెండర్‌ను వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య సోమవారం ఆవిష్కరించారు. అంధుల కోసం ప్రత్యేకంగా బ్రెయిలి లిపిలో క్యాలెండర్ రూపొందించిన అంధ విద్యార్థులను ఎంపీ అభినందించారు.
BDK: డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారులు ఇందిరమ్మ ఇళ్ళ పథకానికి అర్హత కోల్పోయారని 9వ వార్డు కౌన్సిలర్ మోరే రూప అన్నారు. సోమవారం భద్రాద్రి జిల్లా కలెక్టరేట్‌లో జరిగిన ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించి మాట్లాడారు. డబుల్ బెడ్ రూమ్లకు ఎంపికైన లబ్ధిదారులకు నేటికీ ఇల్లు పంపిణీ చేయలేదన్నారు.బ ఆ డబుల్ బెడ్ రూమ్ నిర్మాణాలు ఇంకా పూర్తి కాలేదన్నారు.
MHBD: జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో నేడు ఎస్పీ రామ్నాథ్ కేతన్ వార్షిక నేర నివేదికను విడుదల చేశారు. జిల్లా పోలీస్ అధికారులతో కలిసి 2024లో జరిగిన నేరాలు వాటి నివారణపై తీసుకున్న చర్యల వార్షిక నివేదికను అందజేశారు. రానున్న రోజుల్లో పోలీసులు మరింత కఠినంగా వ్యవహరించి నేరాలను అదుపు చేస్తారని ఎస్పీ స్పష్టం చేశారు.
MNCL: SC, ST, BC నిరుద్యోగ యువతకు ప్రభుత్వం నుంచి సబ్సిడీ వాహనాలు అందించాలని ఆలిండియా SC, ST ఐక్యవేదిక నాయకులు కోరుతూ మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్‌కు వినతిపత్రం అందజేశారు. తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తిరుపతి మాట్లాడుతూ.. గత ప్రభుత్వం ఆటోలకు సబ్సిడీ తీసివేస్తే, ప్రస్తుత ప్రభుత్వం కార్లకు సబ్సిడీ ఇవ్వడం లేదన్నారు. DIC ద్వారా ఆటోలు, కార్లకు సబ్సిడీ ఇవ్వాలని కోరారు.
WGL: ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్(PRTU తెలంగాణ) జిల్లా నూతన సంవత్సర 2025 క్యాలెండర్‌ను వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి నేడు ఆవిష్కరించారు. తెలంగాణ గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షులు బొనగాని యాదగిరి గౌడ్, PRTU జిల్లా అధ్యక్షులు కోలెపాక సంగీత, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస రెడ్డి పాల్గొన్నారు.