BDK: 11కేవీ పినపాక ఫీడర్లో లైన్ మరమ్మతుల కారణంగా శుక్రవారం పినపాక మండలంలో విద్యుత్ నిలిపివేస్తున్నట్లు ఏఈ వేణు ప్రకటనలో తెలిపారు. నేడు ఉదయం 9 నుంచి 12 గంటల వరకు పినపాక, సీతంపేట, గోపాలరావుపేట, తోగ్గూడెం, గోవిందాపురం, నారాయణపురం, బోటిగూడెం, మడతనకుంట, ఉప్పాక, ఎల్లాపురం ఏరియాలలో విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని, వినియోగదారులు సహకరించాలని కోరారు.
BDK: జిల్లాలోని ఐటీడీఏ గిరిజన నిరుద్యోగ యువకులకు పలు ప్రైవేట్ రంగంలో ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం ఈనెల 12న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు శుక్రవారం పీవో రాహుల్ ప్రకటించారు. ఉపాధి కోసం పలు ఇన్సూరెన్స్ కంపెనీలు, ఐటీసీ ప్రథమ సంస్థ ద్వారా బ్యూటీషియన్, అసిస్టెంట్ ఎలక్ట్రిషియన్‌లో రెండు నెలల ఉచిత భోజన వసతితో శిక్షణ ఇస్తారని తెలిపారు.
KMM: తల్లాడ మండలం కుర్నవల్లి గ్రామంలో వరి గడ్డి వాము దగ్ధమైంది. గ్రామంలోని సొసైటీ బజారులో ఉన్న, కర్నాటి దుర్గకు చెందిన నాలుగు ఎకరాలకు చెందిన వరిగడ్డిని వాము వేసి ఉంచారు. దానికి గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో కాలిపోయిందని బాధితురాలు వాపోయారు. దీంతో పశువులకు మేత లేకుండా పోయిందని, రూ.40వేల ఆస్తి నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.
KMM: నగరంలోని టీడీపీ ఆఫీస్ పక్కన ఇంటిగ్రేటెడ్ కూరగాయల మార్కెట్ ఆవరణలో గ్రామభారతి, సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఈనెల 8న మెగా ఆర్గానిక్ మేళా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు నల్లమల వెంకటేశ్వరరావు గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉదయం 10 గంటలకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రారంభిస్తారని వెల్లడించారు.
MDK: తెలంగాణ హెల్త్ ఎడ్యుకేషన్ అండ్ మీడియా ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రూపొందించిన డైరీ, క్యాలెండర్‌లను మంత్రి దామోదర్ హైదరాబాద్‌లోని తన నివాసంలో ఆవిష్కరించారు. వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్ళాలని సూచించారు. వ్యాధుల, చికిత్సల పట్ల ప్రజలకు అవగాహన కల్పించడంలో ఆఫీసర్ల పాత్ర కీలకమైందన్నారు.
HYD: వ్యక్తి దారుణ హత్యకు గురైన ఘటన పాతబస్తీలోని బండ్లగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం మధ్యాహ్నం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. స్థానిక ఇందిరా నగర్‌కు చెందిన షాబాజ్ (23) అనే వ్యక్తిపై దుండగులు కిరాతకంగా కత్తులతో దాడి చేసి చంపేశారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీం సహాయంతో దర్యాప్తు చేపట్టారు.
JGL: తెలంగాణ ప్రభుత్వం అమృత్ 2.0 కింద మెట్‌పల్లిలో గురువారం నూతన మాస్టర్ ప్లాన్ కొరకు డ్రోన్ ద్వారా సర్వే ఆఫ్ ఇండియా డిపార్ట్మెంట్ ద్వారా సర్వే నిర్వహించాలని అదేశించారు. ఈ మేరకు మున్సిపల్ ప్రత్యేక అధికారి అదనపు కలెక్టర్ గౌతమ్ రెడ్డి సర్వేను ప్రారంభించారు. పట్టణములో 50 సర్వే పాయింట్లు గుర్తించామని, ఈ సర్వేకు పట్టణ ప్రజలు అందరూ సహకరించాలని కోరారు.
MHBD: నెల్లికుదురు మండలం రామన్నగూడేనికి చెందిన జిల్లా కాంగ్రెస్ నాయకులు కాసం రంజిత్ రెడ్డి ఈరోజు టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షులు మహేశ్ కుమార్ గౌడ్‌ని హైదరాబాద్‌లోని తన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులపై చర్చించినట్లు తెలిపారు.
MHBD: కురవి మండలానికి చెందిన శ్రీనాథ్ సినీ రంగంలో తొలి అడుగు వేశారు. సినీ రంగంపై మక్కువ పెంచుకున్న శ్రీనాథ్.. తల్లిదండ్రుల ఆశీస్సులతో, కాలాన్ని భవిష్యత్తుని ఫణంగా పెట్టి కఠోర శ్రమతో నేడు అసోసియేట్ డైరెక్టర్‌గా ఎదిగారు. ఈనెల 7న విడుదల కాబోయే, నాగచైతన్య, సాయిపల్లవి నటించిన తండేల్ చిత్రంలో తన ప్రతిభ పరిచయం చేస్తున్నాడు.
WGL: గ్రేటర్ వరంగల్ పరిధిలోని 46వ డివిజన్ రాంపురం శివారులో ఉన్న డంపింగ్ యార్డ్‌ను వెంటనే ఎత్తివేసేలా చేపట్టే ఉద్యమానికి సహకరించాలని కోరుతూ మడికొండ సీఐ పీ.కిషన్‌కు పలు గ్రామాల ప్రజలు వినతి పత్రం అందజేశారు. రాంపురం, మడికొండ గ్రామాల ప్రజలు నేడు సీఐని కలిసి సమస్య తీవ్రతను వివరించి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
KNR: కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి కాంగ్రెస్ పార్టీ నుంచి రెబల్ అభ్యర్థిగా అదిలాబాద్ జిల్లా మహిళా ప్రెసిడెంట్ మంచికట్ల ఆశమ్మ నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ పత్రాలను జిల్లా కలెక్టరేట్లో గురువారం సమర్పించారు. తాను 30 ఏళ్లుగా పార్టీ కోసం కష్టపడుతున్నానని, పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి రెబల్‌గా నామినేషన్ వేసినట్లు తెలిపారు.
PDPL: రామగిరి మండలం కల్వచర్ల గ్రామానికి చెందిన జాపతి రాజయ్య అనారోగ్యంతో మరణించగా కుటుంబ సభ్యుల అంగీకారం మేరకు నేత్రదానం చేశారు. లయన్స్ క్లబ్ సెంటినరీ కాలనీ, సదాశయ ఫౌండేషన్ ఆధ్వర్యంలోహైదరాబాద్ ఎల్‌వీ ప్రసాద్ ఆసుపత్రి టెక్నీషియన్ ప్రదీప్ మృతుడి నేత్రాలను సేకరించి ఐ బ్యాంకుకు తరలించారు. కుటుంబ సభ్యులు దేవక్క, శ్రీనివాస్, శేఖర్, రమ, పాల్గొన్నారు.
SRCL: కాంగ్రెస్ పార్టీతోనే ఉద్యోగ, నిరుద్యోగ పట్టబద్రుల సమస్యలు పరిష్కారం అవుతాయని కరీంనగర్ అదిలాబాద్- నిజామాబాద్- మెదక్ పట్టభద్రుల కాంగ్రెస్ అభ్యర్థి వూటుకూరి నరేందర్ రెడ్డి స్పష్టం చేశారు. గురువారం జిల్లా కేంద్రంలో గల కళాశాల మైదానం బతుకమ్మ ఘాట్, కార్గిల్ లేక్, ఇంద్ర పార్క్, రాజీవ్ నగర్ స్టేడియం వాకర్స్‌తో ముఖాముఖి సమావేశం నిర్వహించారు.
PDPL: తప్పుడు అఫిడవిట్లతో పోలీసు వెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసిన ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు గోదావరిఖని వన్ టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి తెలిపారు. తమపై ఎలాంటి కేసులు లేవంటూ దరఖాస్తు చేసుకున్న విజయ్, రాజేశ్ కుమార్లపై ఎస్‌బీ అధికారులు వెరిఫికేషన్ చేసి క్రిమినల్ కేసులు ఉన్నట్లు నిర్ధారించామన్నారు.