NZB: నిజామాబాద్ నగరంలో జరిగిన జోనల్ స్పోర్ట్స్ మీట్‌లో ఆర్మూర్ శ్రీచైతన్య పాఠశాల విద్యార్థులు సత్తా చాటారు. జూనియర్ కబడ్డీ, సీనియర్ ఖోఖో, చెస్, క్యారమ్స్, పరుగు పందెంలో పాఠశాల విద్యార్థులు బహుమతులు సాధించారు. గెలుపొందిన క్రీడాకారులను సోమవారం పాఠశాలలో ఉపాధ్యాయులు అభినందించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ముత్తు నందిపాటి, ప్రసన్న, శ్రీవిద్య ఉన్నారు.
NRML: రెండు రోజుల బంద్ తరువాత కుబీర్ మార్కెట్‌లో ఈరోజు సీసీఐ పత్తి కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. మార్కెట్లో సోమవారం క్వింటాల్ సీసీఐ పత్తి ధర రూ. 7,471గా, ప్రైవేట్ పత్తి ధర రూ. 6,900గా నిర్ణయించారు. శుక్రవారం ధరతో పోలిస్తే సోమవారం సీసీఐ ధరలో ఎలాంటి మార్పులేదని, ప్రైవేట్ ధరలో మాత్రం రూ. 200 పెరిగిందని అధికారులు వెల్లడించారు.
NLG: కొండమల్లేపల్లిలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఎస్ఎఫ్ఐ 55వ ఆవిర్భావ వేడుకల్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. దేవరకొండ డివిజన్ అధ్యక్ష, కార్యదర్శులు రామావత్ లక్ష్మణ్ నాయక్, బుడిగ వెంకటేష్ స్వాతంత్రం ప్రజాస్వామ్యం సోషలిజం అనే నినాదంతో ఉన్న జెండాను డివిజన్ అధ్యక్షుడు రామావత్ లక్ష్మణ్ నాయక్ ఆవిష్కరించి మాట్లాడారు. 1970లో డిసెంబర్ నెలలో ఏర్పాటయింది అన్నారు.
SRD: జిల్లా కలెక్టర్ కార్యాలయం సోమవారం అర్జీదారులతో కిటకిటలాడింది. తమ సమస్యలను అధికారులకు విన్నవించేందుకు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ప్రజలు తమ సమస్యలను అధికారులకు విన్నవించారు. ప్రజల సమస్యలను ఓపికగా విన్న అధికారులు పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
KNR: కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ ఎదుట సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగులు చేతులకు తాళ్లు కట్టుకొని నిరసన వ్యక్తం చేశారు. 16 రోజులుగా సమ్మెలో ఉండి నిరసన వ్యక్తం చేసినప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమని వారు మండిపడ్డారు. సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగులందరిని క్రమబద్ధీకరించాలని కోరారు. కొత్త పే స్కేల్ ప్రకారం వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు.
NZB: నిజామాబాద్ మేయర్ దండు నీతూ కిరణ్ భర్త దండు శేఖర్‌ను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సోమవారం ఆయన నివాసంలో పరామర్శించారు. ఇటీవల ఆయనపై ఒకరు దాడి చేయగా గాయపడి ఆసుపత్రిలో చేరి ప్రాణాపాయం నుంచి బయటపడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నిజామాబాద్ వచ్చిన కవిత మేయర్ ఇంటికి వెళ్లి శేఖర్ను పరామర్శించి ఘటన వివరాలు తెలుసుకున్నారు.
NLG: కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో అర్హులైన ప్రతి పేదవారికి ప్రభుత్వ ఇందిరమ్మ ఇల్లు మంజూరు అవుతుందని కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు అల్లి సుభాష్ అన్నారు. సోమవారం నల్గొండలోని పెద్దబండ 20వ వార్డులో ఆయన మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి, జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భూమిలేని నిరుపేదలకు కూడా ఇల్లు మంజూరు చేయించడానికి కృషి చేస్తున్నారని అన్నారు.
SRD: అప్పుడే పుట్టిన శిశువును రోడ్డు పక్కన వదిలి వెళ్లిన ఘటన సదాశివపేట జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. గమనించిన వాహనదారులు వెంటనే 108 సిబ్బంది, పోలీసులకు సమాచారం అందజేశారు. దీంతో వారు శిశువును సదాశివపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. శిశువుకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
SRCL: వేములవాడ అర్బన్, రూరల్, కొనరావుపేట, చందుర్తి, రుద్రంగి మండలాలకు సుమారు రూ. 12.47 కోట్ల నిధులు మంజూరైనట్లు స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు. ఐదు మండలాల్లోని అభివృద్ధి పనులకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయడం పట్ల ఆయా మండలాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
SRCL: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బొంపల్లి సురేందర్ రావు డిమాండ్ చేశారు. ముస్తాబాద్ మండల కేంద్రంలో ఇవాళ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రతి ఎకరానికి రూ. 15 వేల చొప్పున రైతు భరోసా ఇవ్వాలని, పూర్తిస్థాయిలో రైతులకు రూ. 2 లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు.
JN: డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి అమిత్ షాను మంత్రి పదవినుంచి తొలగించాలని చిల్పూర్ మండల కేంద్రంలో గ్రామ పంచాయతి వద్ద మండల సీపీఎం మండల కమీటి ఆధ్వర్యంలో అమిత్ షా దిష్టి బొమ్మ దహనం చేశారు. వామపక్ష పార్టీలు దేశవ్యాప్తంగా ఈ రోజు రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని అంబేద్కర్ ఆశయాలు కొనసాగించాలన్నారు.
HYD: చాంద్రాయణగుట్ట డివిజన్ పరిధిలో సోమవారం కార్పొరేటర్ అబ్దుల్ వహాద్ పర్యటించారు. పర్యటనలో భాగంగా హఫీజ్ బాబా నగర్‌లో కొనసాగుతున్న మేజర్ నాలా పనులను పరిశీలించారు. నిర్మాణ పనుల పురోగతిపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. పనుల్లో వేగం పెంచాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించారు.
MHBD: విశ్వబ్రాహ్మణ కార్పెంటర్స్ అసోసియేషన్ నూతన క్యాలెండర్‌ను సోమవారం తొర్రూరు పట్టణ కేంద్రంలోని పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయ ప్రాంగణంలో ఆ సంఘ నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆ సంఘం మండల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు సల్వోజు దేవేంద్రాచారి, దుర్సోజు అంజనాచారిలు మాట్లాడుతూ.. కార్పెంటర్స్ అభివృద్ధికి, విశ్వబ్రాహ్మణుల ఐక్యత కోసం కృషిచేస్తామని అన్నారు.
MNCL: జన్నారం మండలంలోని అన్ని గ్రామాల ప్రధాన కూడళ్ల వద్ద నిరంతర వాహన తనిఖీలు ఉంటాయని ఎస్సై రాజవర్ధన్ వెల్లడించారు. సోమవారం జన్నారం పోలీస్ స్టేషన్‌లో ఆయన మాట్లాడుతూ.. నూతన సంవత్సరం ప్రారంభమవుతున్న నేపథ్యంలో మద్యం తాగి వాహనాలు నడపవద్దని సూచించారు. బహిరంగ ప్రదేశాలలో మద్యం తాగవద్దని, డీజేలకు అనుమతి లేదన్నారు. పోలీసులకు.. మండల ప్రజలు సహకరించాలని కోరారు.
HYD: అమావాస్య సందర్భంగా ఉప్పల్‌లోని కాలభైరవ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. ఈ సందర్భంగా ఉప్పల్ MLA బండారి లక్ష్మారెడ్డి పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాలభైరవ స్వామి కరుణతో ప్రజలందరికీ శ్రేయస్సు, శాంతి కలగాలని కోరుకున్నట్లు తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం శక్తిమేర కృషి చేస్తానన్నారు.