ADB: బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆడే గజేందర్ అధ్వర్యంలో హైదరాబాద్ కాంగ్రెస్ పార్టీ సభకు నియోజకవర్గంలోని మండల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున శుక్రవారం బయలుదేరారు. నేరడీగొండ మండలంలో జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ముఖ్యఅతిథిగా హాజరవుతున్న సమావేశాన్ని విజయవంతం చేయాలని కోరారు.