HNK: దొడ్డి కొమురయ్య వర్ధంతి సందర్భంగా BRS ఆఫీసులో ఆయన చిత్రపటానికి జిల్లా పార్టీ అధ్యక్షుడు వినయ్ భాస్కర్, నేతలు నివాళులర్పించారు. పెత్తందారీ విధానానికి వ్యతిరేకంగా కొమురయ్య పోరాడి అమరుడయ్యాడని అన్నారు. తెలంగాణ కోసం పోరాడిన మహనీయులకు గుర్తింపును ఇచ్చి, వారి జయంతులను, వర్ధంతులను అధికారికంగా నిర్వహించిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు.