MBNR: మహబూబ్నగర్ పోలీసు కార్యాలయంలో శుక్రవారం మాజీ సీఎం రోశయ్య జయంతి నిర్వహించారు. ఎస్పీ జానకి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..రోశయ్య పరిపాలనలో నిష్ఠ, నియమం,సేవా తత్వంతో ప్రజల హృదయాల్లో నిలిచిపోయారన్నారు. ఈ కార్యక్రమంలో AR అదనపు ఎస్పీ సురేశ్ కుమార్, AO రుక్మిణిబాయి, RIలు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.