ADB: భీంపూర్ మండలంలోని ధనోరా గ్రామం నుంచి కరంజీ(టి) గ్రామానికి రోడ్డు మార్గం అధ్వానంగా తయారైంది. దీంతో స్థానికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఎమ్మెల్యే అనిల్ జాదవ్‌కు స్థానిక బీఆర్ఎస్ నాయకులు వివరించారు. ఈ మేరకు స్పందించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్ రోడ్డు మార్గానికి తాత్కాలిక మరమ్మత్తులు చేయాలని సూచించడంతో శుక్రవారం పనులను ప్రారంభించారు.