అహ్మదాబాద్ ఎయిరిండియా ప్రమాదం తర్వాత ఇటీవలి కాలంలో విమానాల్లో సాంకేతిక లోపాలు పెరుగుతున్నాయి. తాజాగా, చెన్నై నుంచి హైదరాబాద్ రావాల్సిన స్పైస్‌జెట్ విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. విమానం టేకాఫ్ అయ్యాక లోపం గుర్తించిన పైలట్, తిరిగి చెన్నైలో ల్యాండ్ చేశారు. రెండు గంటలుగా ప్రయాణికులు అందులోనే ఉన్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై స్పష్టత లేకపోవడంతో అసహనం వ్యక్తం చేశారు.