నటి నయనతార తన భర్తతో విడాకులు తీసుకోబోతున్నారనే వార్త నెట్టింట వైరల్ అవుతోంది. ‘తెలివి తక్కువ వ్యక్తిని పెళ్లి చేసుకున్నప్పుడు మ్యారేజ్ అనేది పెద్ద మిస్టేక్’ అంటూ ఆమె పెట్టినట్లుగా ఓ పోస్ట్ ప్రచారంలో ఉంది. దీంతో ఆమె విడాకులు తీసుకోబోతున్నారనే చర్చ మొదలైంది. అయితే, ఈ పోస్ట్‌ను నయనతార పెట్టలేదని, ఎవరో కావాలనే ఎడిట్ చేసి వైరల్ చేస్తున్నారని అభిమానులు ఖండిస్తున్నారు.