TG: రాష్ట్రంలో కాంగ్రెస్ గెలుపు కార్యకర్తల కృషి ఫలితమేనని AICC అధ్యక్షుడు ఖర్గే అన్నారు. LB స్టేడియంలో కాంగ్రెస్ సామాజిక న్యాయ సమరభేరి కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ‘రేవంత్, భట్టి, మంత్రులు గెలుపు కోసం కృషి చేశారు. KCR, BJP కలిసి కాంగ్రెస్ను అడ్డుకున్నారు. కాంగ్రెస్ హయాంలోనే TGలో 50కి పైగా కేంద్ర సంస్థలు వచ్చాయి. మోదీ ప్రజలకు చెప్పేవన్నీ అబద్ధాలే’ అని పేర్కొన్నారు.