టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల ‘కుబేర’ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నాడు. ఆయన ప్రస్తుతం నాచురల్ స్టార్ నానితో సినిమా చేయాలని అనుకుంటున్నారట. అయితే, ప్రస్తుతం నాని ‘ప్యారడైజ్’ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత సుజిత్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నట్లు సమాచారం. దీంతో శేఖర్ కమ్ములకు రెండేళ్లు వరకు నాని దొరికే అవకాశం లేనట్లు తెలుస్తోంది.