సత్యసాయి: ముదిగుబ్బ మండలంలోని జొన్నలకొత్తపల్లి గ్రామంలో ఉచిత కందులు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముదిగుబ్బ ఎంపీపీ ఆదినారాయణ యాదవ్ పాల్గొని రైతులకు కందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ.. రైతులు ప్రధానమంత్రి ఫసల్ భీమా యోజన (PMFBY) భీమాను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అధికారులు అర్హులందరికీ కందులు అందేలా చూడాలని సూచించారు.