WNP: కొత్త రేషన్ కార్డు లబ్ధిదారులకు రేషన్ ఇవ్వాలని సీపీఐ పట్టణ కార్యదర్శి రవీందర్ అన్నారు. ఈ మేరకు శుక్రవారం అమారచింత మండల తహసీల్దార్‌కు వినతి పత్రం అందజేశారు. మూడు నెలల రేషన్ బియ్యం పంపిణీ చేయాలని డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు, భాస్కర్, శ్యాం సుందర్, పలువురు పాల్గొన్నారు.