ATP: పామిడి మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో రేపు మండల సర్వసభ్య సమావేశం నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో తేజోష్ణ శుక్రవారం మీడియాకు తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. రేపు ఉదయం 11 గంటలకు జరిగే ఈ సమావేశానికి ఎంపీపీ మురళి అధ్యక్షత వహిస్తార న్నారు. ఆయా శాఖల అధికారులు తమ ప్రగతి నివేదికలతో హాజరుకావాలని సూచించారు.