BDK: ఆర్టీసీ బస్టాండ్‌లో పెట్రోల్ బంక్ నిర్మిస్తే సహించబోమని దమ్మపేట బస్టాండ్ సాధన కమిటీ సభ్యులు అన్నారు. పెట్రోల్ బంక్ నిర్మాణానికి వ్యతిరేకంగా నల్ల మాస్కులు ధరించి శుక్రవారం ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహసీల్దార్‌కు వినతిపత్రం అందించారు. ఆర్టీసీ ఆదాయం కోసం దిగజారుడు పనులు చేస్తుందని విమర్శించారు. ప్రయాణీకుల కోసం బస్టాండ్‌ను పునరుద్ధరించాలి కోరారు.