WGL: సంగెం మండలం గవిచర్ల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం గోదాంను కలెక్టర్ సత్య శారద శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రైతుల పంట రుణాల వివరాలు తెలుసుకుని ఒక్క రైతుకు ఎన్ని బస్తాలు యూరియా ఇస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. యూరియా బస్తాలను ఎమ్మార్పీ ధరకే విక్రయించాలి స్టాక్ ఎప్పటికప్పుడు అందుబాటులోకి ఉంచుకోవాలని సూచించారు.