ASR: జిల్లా జీ. మాడుగుల మండలం వలసపాడు నుంచి చుట్టుకోట వరకు తారు రోడ్డు మంజూరు చేయాలని పెసా కమిటీ మండల అధ్యక్షుడు లకే రామకృష్ణ డిమాండ్ చేశారు. ఈమేరకు శుక్రవారం పాడేరు ఐటీడీఏలో జరిగిన మీ కోసంలో పెసా కమిటీ సభ్యులు స్థానిక ప్రజలతో కలిసి వినతిపత్రం సమర్పించారు. అలాగే గానుగురోలు గ్రామం నుంచి గెమ్మెలిబారు, చెరువుబంధ గ్రామాలకు బీటీ రోడ్లు నిర్మించాలని అధికారులను కోరారు.