MBNR: మిడ్జిల్ మండలం రాణిపేట్లో డ్రైడే-ఫ్రైడే కార్యక్రమాన్ని గ్రామపంచాయతీ కార్యదర్శి సుదర్శన్ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించారు. వర్షాకాలంలో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. రోగాల బారిన పడకుండా జాగ్రత్తలు పాటించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఆశావర్కర్, అంగన్వాడీ టీచర్, గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.