NLR: జిల్లా కావలి పట్టణం 8వ వార్డు చింతం వారి వీధిలో రూ. 22 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డుకు MLA క్రిష్ణారెడ్డి శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గత ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వంలో విధ్వంసకర పాలన సాగిందని, కనీసం రోడ్డు, చిన్న కాలువలు కట్టడం కూడా చేయలేదని, పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహారించారని విమర్శించారు. కూటమి పాలనలో ఎంతో అభివృద్ధి సాధించామని తెలిపారు.