SRD: దొడ్డి కొమురయ్య వర్ధంతి సందర్భంగా సంగారెడ్డిలోని ఆయన విగ్రహానికి శుక్రవారం పూలమాలవేసి నివాళి అర్పించారు. జిల్లా బీసీ అభివృద్ధి అధికారి జగదీష్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఆయన మాట్లాడుతూ.. దొడ్డి కొమరయ్య స్ఫూర్తిని ప్రతి ఒక్కరు ముందుకు తీసుకెళ్లాలని చెప్పారు. కార్యక్రమంలో సంఘాల నాయకులు పాల్గొన్నారు.