KMM: తల్లాడ మండల మాజీ సర్పంచులు తమ పెండింగ్ బిల్లుల సమస్యలు పరిష్కరించాలని సర్పంచుల జేఏసీ పిలుపు మేరకు చలో హైదరాబాద్‌కు బయలుదేరగా తల్లాడ మండల పరిధిలో ఉన్న సర్పంచులను పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. అరెస్టులు చేయడం అప్రజాస్వామికమని సీపీఎం మండల కార్యదర్శి అన్నారు. సర్పంచులు పదవీకాలం ముగిసి 13 నెలలు అయినా నేటికి బిల్లులు మంజూరు చేయకపోవడం సరికాదన్నారు.
SRPT: BJP జిల్లా అధ్యక్షుల ఎన్నికపై దుమారం చెలరేగుతోంది. 3జిల్లాల అధ్యక్ష పదవులకు కీలక నేతలు బరిలో ఉండటంతో బాధ్యతలు ఎవరికివ్వాలనే విషయంలో అధిష్ఠానం డైలమాలో పడింది. యాదాద్రి, SRPT జిల్లాలకు సంబంధించి నాయకుల మధ్య పోటీ తీవ్రంగా ఉంది. ముఖ్యనేతలు సైతం ఏకాభిప్రాయానికి రాలేకపోవడంతో ఎవరికివ్వాలనే విషయంలో సందిగ్ధం కొనసాగుతోంది.
BDK: ఐదు సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకు తప్పనిసరిగా వ్యాధి నిరోధక టీకాలు వేయాలని పినపాక పీహెచ్సి వైద్యురాలు దుర్గ భవాని అన్నారు. బుధవారం ఆమె పోతిరెడ్డిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి, టీకా వేసే కార్యక్రమంలో పాల్గొన్నారు. తల్లి, బిడ్డల సంరక్షణ కోసం ప్రతినెల వైద్య సిబ్బంది బాలింతలను గుర్తించి టీకా వేసే విధంగా కృషి చేయాలని అన్నారు.
KMR: ఎల్లారెడ్డిలో బస్ డిపో ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే మదన్మోహన్ రావు.. మంత్రి పొన్నం ప్రభాకర్ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రతి మారుమూల గ్రామాలకు బస్ సౌకర్యం కల్పించాలనే ఉద్దేశ్యంతో మంత్రిని కలిసినట్లు వివరించారు. సరైన రవాణా సౌకర్యం లేకపోవడంతో 40 ఏళ్ల నుంచి ఎల్లారెడ్డి నియోజకవర్గం వెనుకబడిందని ఎమ్మెల్యే తెలిపారు.
SDPT: చేర్యాల మండలం ముస్త్యాల్లో బుధవారం BRS చేర్యాల మున్సిపల్ మాజీ కౌన్సిలర్ మంగోలు చంటి, మేడిశెట్టి శ్రీధర్, ఎల్లారెడ్డి, ఆకుల రాజేష్ సీనియర్ నాయకులు ముఖ్య సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. రానున్న రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ అత్యధిక స్థానాలు సాధించేలా ప్రతిఒక్కరూ కృషి చేయాలని తెలిపారు.
SDPT: మరమ్మతుల పేరుతో తొగుట మండలం కాన్గల్, తుక్కాపూర్ గ్రామాలకు సప్లై అయ్యే ట్రాన్స్ఫార్మర్లను తుక్కాపూర్ సబ్స్ స్టేషన్ నుంచి తరలిస్తున్నారన్న విషయం తెలుసుకొని కాన్గల్, తుక్కాపూర్ గ్రామ రైతులు అడ్డుకున్నారు. రైతుల నిరసనకు బీజేపీ నాయకులు మద్దతుగా నిలిచారు. రైతుల, నాయకుల ఆందోళనలతో ట్రాన్స్ ఫార్మర్ల తరలింపుకు వాహనాలను అధికారులు తిరిగి రోడ్డుపైకి పంపించారు.
KMM: కేంద్ర బడ్జెట్లో కార్మిక, వ్యవసాయ రంగాలకు రూ. 2లక్షల కోట్లు కేటాయింపులు చేయాలని కోరుతూ అభిలపక్ష కార్మిక రైతు సంఘాల ఆధ్యర్యంలో బుధవారం ఖమ్మంలోని జెడ్పీ సెంటర్ వద్ద నిరసన చేపట్టారు. ఈ సంధర్బంగా బడ్జెట్ ప్రతులను దగ్ధం చేశారు. మూడు రైతు వ్యతిరేక వ్యవసాయ నల్ల చట్టాలను రద్దు చేయాలని, నాలుగు కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
SDPT: దూల్మిట్ట మండలం వీర బైరాన్ పల్లి గ్రామానికి చెందిన చొప్పరి రాజేశ్వరికి అరుదైన వ్యాధి పాలిఆర్టికులర్ జువైనల్(ఎదుగుదల లోపించడం)తో బాధపడుతుంది. వైద్యానికి పెద్ద మొత్తంలో డబ్బులు అవసరం పడగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు నాగపురి కిరణ్ కుమార్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన ఆయన రూ.2.25 లక్షల ఎల్ఓసి మంజూరు చేయించి నేడు అందజేశారు.
మెదక్: తాండూర్ పట్టణంలోని మాతా, శిశు సంరక్షణ కేంద్రంలో నవజాత శిశువు మృతి చెందింది. పెద్దేముల్ మండలం తట్టేపల్లికి చెందిన నర్సింలు భార్య రాజేశ్వరి గర్భందాల్చింది. పురిటినొప్పులు రాగా కుటుంబీకులు మాతా, శిశు ఆసుపత్రికి తరలించగా వైద్యులు కాన్పు చేశారు. మగ శిశువు పుట్టినా కాన్పులోనే చనిపోయాడు. శిశువు మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని తల్లితండ్రులు ఆరోపించారు.
NZB: కేంద్ర యువజన క్రీడా మంత్రిత్వ శాఖ ప్రతి సంవత్సరం నిర్వహించే అంతర్ జిల్లాలయువ ఎక్స్ఛేంజ్ కార్యక్రమంలో భాగంగా HYDలో ఈనెల11 నుంచి 15 వరకు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన యువతీయువకులకు నైపుణ్య శిక్షణ ఉంటుందని NYK కో ఆర్డినేటర్ శైలి బెల్లాల్ తెలిపారు. ఎంపికైన 25 మందికి మాత్రమే అవకాశంఉంటుందని, శిక్షణలోపాల్గొనే ఆసక్తి ఉన్నవారు NYKలో సంప్రదించాలన్నారు.
MDK: విద్యుత్ సర్కిల్ కార్యాలయ ప్రాంగణంలో మంగళవారం సాయంత్రం 3 గంటలకు సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు ఎస్ఈ శంకర్ తెలిపారు. జిల్లాలోని విద్యుత్ వినియోగదారులు, పరిశ్రమల యజమానులు, రైతులు హాజరుకావాలని కోరారు. జిల్లాలో ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్ నెలల్లో అవసరాల కోసం సుమారు రూ.35.09 కోట్లతో ప్రణాళికలను రూపొందించిందన్నారు.
HYD: హైదరాబాద్-తిరుపతి విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. ఇవాళ ఉ.5:30 నిమిషాలకు బయల్దేరాల్సిన విమానంలో సాంకేతిక లోపం నెలకొంది. అయితే దీనిపై చివరి నిమిషంలో ప్రయాణికులకు సమాచారం ఇచ్చారట. దీంతో ఎయిర్‌పోర్టులో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. ఎయిర్వేస్ తీరుపై తిరుమల వెళ్లే ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
BNR: తెలంగాణ మాదిగ ఉద్యోగుల సమాఖ్య భువనగిరి జిల్లా కమిటీని నియమిస్తూ ఆ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లెపాక వెంకన్న మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా అధ్యక్షులు మహేష్,ప్రధాన కార్యదర్శిగా కొండపల్లి సురేష్ నియమించారు. ఈ సందర్భంగా MRPS వ్యవస్థాపక అధ్యక్షులు పద్మ శ్రీ మంద కృష్ణ మాదిగ వారికి ఉత్తర్వుల పత్రాలను అందజేశారు.
HYD: హైదరాబాద్ పరిధిలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్(IOCL)లో ఉద్యోగాల పార్టీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ మేరకు టెక్నికల్, నాన్ టెక్నికల్ పోస్టులకు సంబంధించి 382 ఉద్యోగాలను భర్తీ చేయనుంది. టెన్త్ పాసై వయసు 18-24 సంవత్సరాలు ఉన్నవారు ఫిబ్రవరి 14వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఆశక్తి గలవారు iocl.com వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.