PDPL: రెవెన్యూ విధులను అధికారులు పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. బుధవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మంథని, ముత్తారం, కాల్వ శ్రీరాంపూర్ మండలాలలో విస్తృతంగా పర్యటించారు. మంథని మండలంలోని రెవెన్యూ డివిజన్ అధికారి కార్యాలయం, నిర్మాణం అవుతున్న నూతన పురపాలక భవన పనులను పరిశీలించారు. అనంతరం ముత్తారం మండలం ధర్యాపూర్లో పర్యటించారు.