AP: విజయనగరం జిల్లాలో మంత్రి నిమ్మల రామానాయుడు పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా తారకరామ తీర్థసాగర్ ప్రాజెక్ట్ను మంత్రి పరిశీలించారు. 90 శాతం పనులు పూర్తయినా గత ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ను నిర్లక్ష్యం చేసిందన్నారు. విజయనగరం పట్టణం, భోగాపురం ఎయిర్పోర్టుకు నీరు అందించడంలో ఇది చాలా కీలకమని చెప్పారు. ప్రాజెక్ట్ పెండింగ్ పనులు త్వరగా పూర్తిచేస్తామని తెలిపారు.