కృష్ణా: విద్యుత్ వినియోగదారుల సమస్యలను పరిష్కరించడానికి ఈనెల 24వ తేదీన కన్స్యూమర్ గ్రీవెన్సెస్ రెడ్రెస్సెల్ ఫోరం (సీజీఆర్ఎఫ్) విజయవాడ ఆధ్వర్యంలో విద్యుత్ ఆదాలత్ నిర్వహించనున్నట్లు ఉయ్యూరు డివిజన్ ఏఈ కృష్ణనాయక్ తెలిపారు. పెదకళ్లేపల్లి రోడ్డులోని వర్తక సంఘం ఫంక్షన్ హాల్లో ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకూ అదాలత్ కొనసాగుతుందని పేర్కొన్నారు.