బంగారం పేరు వింటేనే సామాన్యులు హడలిపోయే పరిస్థితి ఏర్పడింది. రోజురోజుకీ పెరుగుతూ వచ్చిన పసిడి ధర ఇవాళ గరిష్ట పెరుగుదల నమోదు చేసి రూ.లక్ష దాటింది. కేవలం 15 రోజుల్లో రూ.10వేలకుపైగా బంగారం ధర పెరిగింది. ఈ నెల 8న 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.89,730 ఉండగా.. ఇవాళ రూ.1,01,350కి చేరింది. అయితే ధరలు విపరీతంగా పెరగటంతో కొనుగోలుదారులు తగ్గిపోయారని వ్యాపారులు వాపోతున్నారు.