MHBD: కురవి మండల కేంద్ర శివారులో సోమవారం మిషన్ భగీరథ పైప్ లీకేజీతో వృధాగా నీరు పోతుంది. మండు వేసవిలో తాగు నీటి కోసం ఇబ్బంది పడుతున్న నేపధ్యంలో పైప్ లైన్ లీకేజి వల్ల ఫౌంటెన్ను తలపిస్తూ వృథాగా పోతుంది. అధికారులు స్పందించి పైప్ లైన్ మరమత్తులు చేపట్టి వృథాగా పోతున్న నీటిని అరికట్టాలని స్థానికులు కోరుతున్నారు.