శ్రీకాకుళం జిల్లా శ్రీశ్రీ వేదిక పురస్కారాలకు జిల్లా నుంచి 12 మంది ఎంపికయ్యారు. ఈ సందర్భంగా సాహిత్య కళా రంగాల్లో పలు రికార్డులు సాధించిన 12 మందికి శ్రీశ్రీ కళావేదిక సంస్థ ఆధ్వర్యంలో పురస్కారాలు అందుకోనున్నారు. ఏలూరులో మే 10, 11వ తేదీలలో నిర్వహించనున్న ప్రపంచ తెలుగు సంబరాల్లో పురస్కారాలను అందించనున్నట్లు నిర్వాహక సంస్థ సమన్వయకర్త వేమన వెల్లడించారు.