AKP: గొలుగొండలో మంగళవారం పోషణ పక్వాడా ముగింపు కార్యక్రమం ఐసీడీఎస్ సీడీపీవో శ్రీగౌరి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా బిడ్డకు మొదటి వెయ్యి రోజులు ఎలాంటి ఆహారం ఇవ్వాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరించారు. అంగన్వాడీ కేంద్రాల నుండి లబ్దిదారులకు అందుతున్న సరుకులు ఎలా వినియోగించుకోవాలో తల్లులకు అవగాహన కల్పించారు.