SKLM: జిల్లా జెడ్పీ కార్యాలయంలో జెడ్పీ ఛైర్మన్ అధ్యక్షతన స్థాయి సంఘాల సమావేశం మంగళవారం అధికారులు నిర్వహించారు. ఈ సమావేశానికి శ్రీకాకుళం ఎమ్మెల్యే గోండు శంకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వేసవి దృష్ట్యా గ్రామాల్లో ఎటువంటి తాగునీటి సమస్యలు ఉండకూడదని ఆర్డబ్ల్యూఎస్ అధికారులని ఆదేశించారు.