PLD: వేసవిలో మూగజీవాల దాహం తీర్చేందుకు నీటి తొట్లు ఉపయోగపడతాయని పశువైద్య శాఖ ఏడీ వెంకటేశ్వర నాయక్ అన్నారు. రొంపిచర్లలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో నిర్మిస్తున్న నీటి తొట్ల నిర్మాణాలను ఏపీవో ప్రసాద్‌తో కలిసి పరిశీలించారు. రైతులు వ్యవసాయంతో పాటు పాడి పరిశ్రమలపై ఆధారపడి జీవిస్తున్నారని అన్నారు.