ఏప్రిల్ 19న LSGతో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ ఓటమిపాలైంది. అయితే, ఈ మ్యాచ్ ఫిక్స్ అయ్యిందని రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ తాత్కాలిక అడ్హక్ కమిటీ కన్వీనర్ తీవ్ర ఆరోపణలు చేశాడు. ఈ వ్యాఖ్యలను రాజస్థాన్ యాజమాన్యం ఖండించింది. అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి, క్రీడా మంత్రికి అధికారికంగా ఫిర్యాదు చేసింది. అతడు చేసినవి తప్పుడు ఆరోపణలని కొట్టిపారేసింది.