MNCL: జన్నారం మండలంలోని చింతగూడ గ్రామంలో ఉన్న పాపన్నగూడాలోని సర్వే నెంబర్ 81/1లో ఉన్న 20 ఎకరాల భూమిని పేదలకు ఇళ్లస్థలాలుగా ఇవ్వాలని సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ నాయకులు కోరారు. ఈ మేరకు వారు మంగళవారం మధ్యాహ్నం నిరుపేదలతో కలిసి జన్నారం పట్టణంలోని ప్రధాన రహదారిపై భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం స్థానిక తహసీల్దార్ కార్యాలయం ముందు బైఠాయించి ఆందోళన చేశారు.