SKLM: జలుమూరు మండలం అల్లాడిపేట గ్రామానికి చెందిన బాన్న వెంకటేష్ సివిల్స్‌లో 15వ ర్యాంకు సాధించి IASకు ఎంపిక అయినట్లు తల్లిదండ్రులు చందర్రావు, రోహిణి తెలిపారు. నేడు విడుదలైన ఈ ఫలితాల్లో వెంకటేష్ ఘన విజయం సాధించడంపై గ్రామ సర్పంచ్ కళ్యాణం శ్రీనివాసరావు, ఆంధ్రప్రదేశ్ వెలమ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంగు మన్మధరావు, గ్రామస్తులు అభినందనలు తెలిపారు.