VSP: ప్రముఖ పుణ్యక్షేత్రమైన తలుపులమ్మ అమ్మవారిని విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ సతీసమేతంగా మంగళవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దక్షిణ నియోజకవర్గం ప్రజలతోపాటు, విశాఖ జిల్లా ప్రజలను, జనసేన కార్యకర్తలను అమ్మవారు సుభిక్షంగా చూడాలని ఆకాంక్షించారు. ఆలయ పూజారులు ఆయనకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.