VZM: భోగాపురం మండలం రావాడలో ఎన్ఫోర్స్మెంట్ ఎస్సై రమణ ఆధ్వర్యంలో బెల్ట్ షాప్ పై మంగళవారం దాడులు నిర్వహించారు. గ్రామంలో పైడిరాజు అనే వ్యక్తి వద్ద నుంచి 12 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు. సదరు వ్యక్తిపై కేసు నమోదు చేసి తదుపరి చర్యలు నిమిత్తం స్థానిక ఎక్సైజ్ స్టేషన్కు అప్పగించామని ఎస్సై తెలిపారు.