ASR: జిల్లాలో మూగ జీవుల దాహర్తిని తీర్చేందుకు ఉపాధి హామీ పథకంలో 927నీటి తొట్టెలు నిర్మాణం జరుగుతుందని PD.డా.విద్యాసాగర్ తెలిపారు. అనంతగిరి మండలం కృష్ణాపురంలో నీటి తొట్టెలను మంగళవారం ఆయన పరిశీలించారు. ఇప్పటి వరకు 290 తొట్టెలు నిర్మాణం పూర్తి అయ్యిందని, మిగిలినవి వారం రోజుల్లో పూర్తి కానున్నాయని తెలిపారు. వేలాది జీవులకు ప్రయోజనం కలుగుతుందన్నారు.