ELR: జిల్లాలో 3రోజుల పర్యటనలో భాగంగా, ఏలూరు జిల్లా ఇన్ఛార్జి మంత్రి నాదెండ్ల మనోహర్ నేడు పోలవరం నియోజకవర్గంలోని బుట్టాయిగూడెం రానున్నారు. ఈ మేరకు మండల కేంద్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేసి, ప్రారంభోత్సవ కార్యక్రమాలలో ఆయన పాల్గొంటారని పార్టీ నాయకులు తెలిపారు. కూటమి నాయకులు పెద్ద ఎత్తున భారీ ఫ్లెక్సీలు ఏర్పాట్లు చేశారు.